తెలంగాణ

ఘన్‌పూర్ చేరని సింగూర్ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 1: ఖరీఫ్‌లో సాగు చేసిన ధాన్యం పంటను రక్షించాలన్న దృక్పథంతో సింగూర్ ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలిపెట్టిన 0.35 టిఎంసిల నీరు వారం రోజులు గడుస్తున్నా ఇంకా ఘన్‌పూర్ ఆనకట్టకు చేరుకోకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సింగూర్ ప్రాజెక్టు నిర్మాణం ఒప్పందం ప్రకారంగా నిల్వ ఉన్న నీటి నుంచి ఘన్‌పూర్ ఆనకట్టకు 0.35 టిఎంసిల నీటిని వదిలిపెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సాగునీటి పారుదల అధికారులు అదే మోతాదులో ఆగస్టు 25వ తేదీన నీటిని దిగువకు వదిలిపెట్టారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రంలోగా 0.35 టిఎంసిల నీటిని వదిలిపెట్టిన అధికారులు నిలిపివేసారు. ఆ నీరు నెమ్మదిగా మంజీర బ్యారేజీకి అక్కడి నుంచి అంతే మొత్తంలో దిగువకు వదిలిపెట్టారు. వర్షాకాలం అంతంత మాత్రంగానే కావడంతో ఏ ఒక్కవాగు కూడా ప్రవహించకపోవడంతో మంజీర నదిలోకి చుక్కనీరు కూడా వచ్చి చేరలేదు. సింగూర్ నుంచి వదిలిన నీరు మొత్తం మంజీర నదిలో ఉన్న పెద్ద పెద్ద గుంతలను నింపడానికే సరిపోయింది. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి వారం రోజులు కావస్తున్నా వదిలిన నీరు ఘన్‌పూర్ ప్రాజెక్టుకు ఇంకా అర కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ నీరు ప్రాజెక్టును తాకిన ఆయకట్టుకు వదిలేందుకు ఎంతమాత్రం వీలుకుదరదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు పరిస్థితి దారుణంగా మారడంతో దాదాపు 50 శాతం మంది రైతులు బోర్లపై ఆధారపడుతున్నారు. ఘన్‌పూర్ ప్రాజెక్టు నుంచి నీరు రాకపోవడంతో పొలాలన్నీ నెర్రెలుబారి ఎండిపోయాయి. ఆలస్యంగా వరినాట్లు వేసిన పొలాలకు కురిసిన కొద్దిపాటి వర్షం వారం రోజుల వరకు జీవం పోస్తుందని రైతులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. అనంతరం కావల్సిన నీటిని ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో దిక్కుతోచని స్థితిలో వరి రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. సింగూర్ ప్రాజెక్టులోకి కొత్తగా నీరు రాకపోవడంతో అధికారులు చేతులెత్తివేసే దుస్థితి దాపురించింది. పంట దిగుబడిపై పూర్తిగా ఆశలు వదిలిపెట్టుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొల్చారం మండలంలో మంజీర నదిపై నిర్మించిన ఘన్‌పూర్ ప్రాజెక్టు (ఫైల్‌ఫోటో)