తెలంగాణ

స్థానిక రిజర్వేషన్లపై సమగ్ర చర్చ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: స్థానిక రిజర్వేషన్ల చర్చను జోనల్ వ్యవస్థకే పరిమితం చేయడం సరైంది కాదని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. స్థానిక రిజర్వేషన్లపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జోనల్ వ్యవస్థ రద్దుపై తొందరపాటు నిర్ణయాల వల్ల తెలంగాణకు దీర్ఘకాలిక నష్టం జరిగే పరిస్థితి ఉంటుందన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో ‘జోనల్ వ్యవస్థ రద్దు’ అనే అంశంపై ఉద్యోగ, విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం గురువారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోదండరామ్ మాట్లాడుతూ స్థానిక రిజర్వేషన్లపై ఎవరికీ అన్యాయం జరగకుండా అన్ని సంఘాలతో విస్తృతంగా చర్చించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. జోనల్ వ్యవస్థను సవరించుకుని ప్రస్తుతం ఉన్న సంఖ్యను పెంచాలని సూచించారు. జోనల్, జిల్లా పోస్టులను ప్రకటించకుండా జోనల్ వ్యవస్థను రద్దు చేయడం సరైంది కాదన్నారు.
గతంలోకోర్టు కేసులలో ఇచ్చిన తీర్పులను ప్రభుత్వ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక రిజర్వేషన్లపై చర్చ జరగాలన్నారు. ఇది కేవలం ఉద్యోగులకు సంబంధించిన విషయం కాదని మొత్తం సమాజనికి సంబంధించిన విషయం అన్నారు. చర్చ జోనల్ వ్యవస్థపై కాకుండా స్థానికతపై జరగాలన్నారు. తెలంగాణ వారికి ఉద్యోగాలు కల్పించి, భవిష్యత్‌లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

చిత్రం.. రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న జెఎసి నేత కోదండరామ్