తెలంగాణ

సిబ్బంది పంపిణీపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణలో దసరా నుంచి కొత్త జిల్లాలు ఉనికి లోకి రావడం అదే రోజు నుంచి విధుల నిర్వహణ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో మంత్రులు కొత్త జిల్లాలకు సన్నద్ధం అవుతున్నారు. తమ శాఖలకు సంబంధించి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ కొత్త జిల్లాల ఏర్పాటుతో సిబ్బంది సర్దుబాటుపై చర్చిస్తున్నారు. గురువారం ఒకే రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తమ శాఖ పరంగా తీసుకోవలసిన చర్యలపై పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమావేశం నిర్వహించారు. పంచాయితీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్, కమీషనర్ అనితా రామచంద్రన్ ఇతర అధికారులు కొత్త జిల్లాల సందర్భంగా తమ శాఖలో చేపట్టాల్సిన మార్పులపై చర్చించారు. అధికారులు, సిబ్బంది సంఖ్య, కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయడంపై చర్చించారు. శనివారం పూర్తి వివరాలతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. డిఆర్‌డిఏ, డ్వామా పిడిలతో పాటు పంచాయితీ రాజ్ ఈఈ, ఎస్‌ఈలతో మంత్రి జూపల్లి ఈ అంశంపై సమావేశం కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాల స్వరూపం మారుతుందని, జిల్లా స్వరూపం చిన్నగా ఉంటుందని దీనిని దృష్టిలోపెట్టుకుని పశు సంవర్థక శాఖ నిర్ణయాలు తీసుకోవాలని, తన సేవలను మరింత విస్తృతం చేయాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా గురువారం తమ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. కొత్త జిల్లాలు ఏర్పడుతున్నందున ఇకపై జిల్లాలో పశు సంవర్థక శాఖ కార్యాలయాలను డిస్ట్రిక్ వెటర్నరి అండ్ అనిమల్ హస్పండరీ ఆఫీస్‌గా, మత్స్య శాఖ కార్యాలయాలను డిస్ట్రిక్ ఫిషరీస్ ఆఫీస్‌గా నామకరణం చేయాలని నిర్ణయించారు. జిల్లాల్లో గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించడానికి జిల్లాకు ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున కేటాయించినట్టు చెప్పారు. గొర్రెల పెంపకం అభివృద్ధి కోసం కేంద్రం రాష్ట్రానికి 398 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత తమ శాఖ నుంచి అందించే సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పశు సంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ చంద, డెయిరీ డెవలప్‌మెంట్ ఎండి నిర్మల, మత్స్య శాఖ కమీషనర్ సంజయ్ కుమార్ , డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాలను విభజిస్తూ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నందున వైద్య ఆరోగ్య శాఖ సైతం ప్రజలకు మరింత సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభావంపై చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు తగినట్టుగా వైద్య శాఖ విభజన ఉండాలని అధికారులకు సూచించారు. ఒక్కో జిల్లా రెండు నుంచి మూడు జిల్లాలుగా అవుతున్నందున ప్రస్తుతం ఒక్క జిల్లాలో ఉన్న అధికారులనే ఈ మూడు జిల్లాలకు సర్దుబాటు చేయాలని చెప్పారు.