తెలంగాణ

వేగంగా ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం, నాగార్జున సాగర్ లో-లెవల్ కెనాల్, డిండి, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, పుట్టంగండి, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, మూసీ ఆధునీకరణ ప్రాజెక్టు, ఉదయ సముద్రం ప్రాజెక్టులతోపాటు శ్రీరాంసాగర్ రెండోదశ పనులు జరుగుతున్న తీరుపై అధికారులనుంచి సమాచారం సేకరించారు. జలసౌధలో శుక్రవారం జరిగిన సమావేశంలో నల్లగొండ జిల్లా ప్రాజెక్టులన్నింటిపై అధికారులు వివరాలు అందించారు. భూసేకరణ సమస్యలు, పులిచింతల పరిధిలోని భూనిర్వాసితుల సహాయ పునరావాస కార్యక్రమాలను మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సమీక్షించారు. నాగార్జునసాగర్ లో-లెవెల్ కెనాల్ పనులు నత్తనడక సాగుతుండటం పట్ల మంత్రి హరీశ్‌రావు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఆగస్టులోగా పూర్తి కావాల్సిన పనులు ఇంకా పెండింగ్‌లో ఎందుకున్నాయని ప్రశ్నించారు. ఈనెల 10న లో-లెవల్ కెనాల్ ఒక పంపు డ్రై రన్ ప్రారంభించాలని, 25న వెట్ రన్‌కు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. అక్టోబర్‌లో అన్ని పంపులు నడపాలని అధికారులకు సూచించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టులో భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని మంత్రి ఆదేశించారు. మూసీ ప్రాజెక్టు కింద తక్షణం 30వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాల్వ పొడవునా జంగిల్ క్లియర్, పూడిక తొలగింపు చేపట్టాలని, దీనికోసం షార్ట్ టర్మ్ టెండర్లు పిలవాలని ఆదేశించారు. మూసీ ఆధునీకరణకు 56 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, దశలవారీగా ప్రాజెక్టు పూర్తికి నిధులు మంజూరవుతాయన్నారు. మూసీ ఆధునీకరిస్తే 42 కిలోమీటర్ల పొడవునున్న కాల్వ ద్వారా సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం మూడు మండలాల్లోని 22 గ్రామాల్లో ఎడమ కాల్వ కింద 18వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 33.8 కిలోమీటర్ల పొడవున్న కుడి కాల్వ కింద మరో 16వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యగా కనిపిస్తోందని, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకొని భూసేకరణ వేగంగా జరిగేలా చూడాలన్నారు.
ప్రాజెక్టులు, ప్యాకేజీల వారీగా భూసేకరణలో ఎదురవుతున్న అడ్డంకులను మంత్రి సమీక్షించారు. నాగార్జునసాగర్ లో-లెవల్ కెనాల్ ప్యాకేజీ 81లో 61 ఎకరాలు, ప్యాకేజీ 110లో 130 ఎకరాలు సేకరించాల్సి ఉందని అధికారులు వివరించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ఇంకా 2233 ఎకరాలు సేకరించాలని, పెండ్లిపాకల రిజర్వాయర్‌లో 1911, ఉదయం సముద్రం కింద 1649, డిండి ప్రాజెక్టు కింద 9385 ఎకరాలు ఇంకా సేకరించాల్సి ఉందన్నారు.
పులిచింతల పునరావాసం
పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల పరిహారం, వౌలిక సౌకర్యాల ఏర్పాట్లపై హరీశ్‌రావు అధికారులతో సమీక్ష జరిపారు. అడ్లూర్, వెల్లటూర్, కిష్టాపురం, చింత్రియాల, నెమలిపురి, రెబల్లె, శోభనాద్రిపురం, సుల్తాన్పుర్ తండా, మట్టపల్లి, గుండ్పల్లి, గుండె బోయినగూడెం, తమ్మవరం, ప్లీకానాయక్ తండా గ్రామాల్లో పునరావాసం కోసం 115 కోట్లు ఇవ్వాలని ఆంధ్ర ప్రభుత్వాన్ని 2015 ఫిబ్రవరిలో కోరామని, అయితే, రెండు రోజుల క్రితమే 66 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. ఈ నిధులు వెచ్చించి తక్షణం పరిహారం, ఇతర పునరావాస చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు అధికారులను కోరారు.

చిత్రం... ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షిస్తున్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు