ఆంధ్రప్రదేశ్‌

దేవుడి సొమ్ము స్వాహా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 2: దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న విజయ సాగర్‌బాబు వద్ద లభ్యమైన అవినీతి సొమ్ములో సింహభాగం శ్రీశైల మల్లికార్జునుడిదే అని ఎసిబి అధికారులు భావిస్తున్నారు. విజయసాగర్‌బాబు రెండు నెలల క్రితం వరకూ శ్రీశైలం దేవస్థానం ఆలయ ఇఓగా పని చేశారు. శ్రీశైలం దేవస్థానం స్థాయిని పెంచి జాయింట్ కలెక్టర్ హోదా కలిగిన అధికారిని ఇఓగా నియమించడంతో సాగర్‌బాబు బదిలీపై వెళ్లారు. ఆయన ఆస్తులపై దాడులు నిర్వహించిన ప్రతిచోటా కరెన్సీ నోట్ల కట్టలు, వెండి, బంగారు ఆభరణాలు, భూములు, ఇంటి స్థలాలకు సంబంధించిన దస్తావేజులు లభ్యం కావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరెన్సీ నోట్ల కట్టలను లెక్కించగా రూ. 3 కోట్లకు పైగా తేలింది. దీనికి తోడు బంగారం, వెండి, భూములు, ఇంటి స్థలాల దస్తావేజులను పరిశీలిస్తే ఆయన ఆస్తుల విలువ రూ. 60 కోట్లకు చేరుకుందని అధికారులు పేర్కొంటున్నారు. విజయవాడలో తనిఖీల అనంతరం శుక్రవారం కర్నూలు నగరంలోని ఆంధ్రా బ్యాంకు సి.క్యాంపుశాఖలో సాగర్‌బాబు పేర ఉన్న లాకర్‌ను తెరిచారు. అందులో రూ. 40.47 లక్షల నగ దు, బంగారు, వెండి ఆభరణాలు, పలు దస్తావేజులు లభ్యమయ్యాయి. దస్తావేజుల్లో కొన్ని ఆయన బినామీగా చర్చించుకుంటున్న శ్రీశైలం ఆలయ ఉద్యోగి శ్రీనివాసరావు పేర ఉన్నట్లు సమాచారం. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అప్పటికే శ్రీశైలం ఆంధ్రా బ్యాంకునుంచి నగదు డ్రా చేసుకుని పరారైనట్లు అధికారులు గుర్తించారు. సాగర్‌బాబు, ఆయన భార్య పేర ఉన్న లాకర్లు, ఇంట్లో బీరువాలో లభ్యమైన నగదును పరిశీలించగా కట్టలపై శ్రీశైలం బ్యాంకు ముద్రలు ఉండడాన్ని గుర్తించారు. అంతేగాకుండా కూడబెట్టిన ఆస్తులు, ఆభరణాలను పరిశీలించగా అవన్నీ కొత్తగా కొనుగోలు చేసినవేనని తేలింది. ఈ సొమ్మంతా మల్లికార్జునస్వామి ఆలయానికి చెందింది అయిఉంటుందని ఏసిబి అధికారులు అభిప్రాయపడుతున్నారు.