తెలంగాణ

తెలంగాణ పోస్టుమాస్టర్ జనరల్‌గా బ్రిగేడియర్ చంద్రశేఖర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరబాద్, సెప్టెంబర్ 2: తెలంగాణ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్‌గా బ్రిగేడియర్ భువనగిరి చంద్రశేఖర్ నియమితులయ్యారు. బ్రిగేడియర్ చంద్రశేఖర్ గతంలో లక్నోలోని ఉత్తరప్రదేశ్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్‌గా పనిచేశారు. ఆయన ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ 1987 బ్యాచ్ అధికారి. ఇప్పటివరకూ తపాలా విభాగంలో 28 సంవత్సరాల సర్వీసు పూర్తి చేశారు. భారతదేశంలో ఆయన ఆర్మీ పోస్టల్ సర్వీసెస్, విజయవాడ ప్రాంతం పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్, థాయిలాండ్ బ్యాంకాక్ లోని ఏషియన్ పసిఫిక్ పోస్టల్ కాలేజీలో లెక్చరర్ -కోర్సు డైరెక్టర్‌గా పనిచేశారు. ముంబై ప్రాంత పోస్టు మాస్టర్ జనరల్‌గానూ, న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ మేనేజర్‌గానూ పనిచేశారు.
సింగరేణిలో నిలిచిన
బొగ్గు ఉత్పత్తి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, సెప్టెంబర్ 2: ఆల్‌ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె శుక్రవారం ఖమ్మం జిల్లాలో విజయవంతం అయింది. జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, సంస్థలు సమ్మెకు మద్దతు తెలపడంతో కార్యకలాపాలు అన్ని నిలిచిపోయాయి. ఆర్టీసి కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడంతో ఖమ్మం రీజియన్‌లోని ఆరు డిపోల పరిధిలో 600 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రగతి చక్రాలు రోడ్డు ఎక్కకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసి బస్సులు రోడ్డు ఎక్కకపోవడంతో సంస్థకు శుక్రవారం ఒక్కరోజే 70 లక్షల నష్టం వాటిల్లింది. సింగరేణి కార్మికులు సమ్మెకు మద్దతు తెలపడంతో బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోవడంతో సంస్థకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. బ్యాంక్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి.
కార్మికులు తలపెట్టిన సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ఉద్యోగ సంఘాల నేతలు భోజనవిరామ సమయంలో కార్యాలయాల ముందు నినాదాలు చేశారు. జిల్లాలో కార్మికుల సమ్మెకు మద్దతుగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు.