తెలంగాణ

జిల్లాల ముసాయదా అశాస్ర్తీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: అశాస్ర్తియంగా ఉన్న జిల్లాల ముసాయిదాను వ్యతిరేకిస్తూ 3, 4 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ తెలిపారు. ఈ దీక్షలో గద్వాల, జనగామతో పాటు అసంతృప్తిగా ఉన్న ప్రజలు పాల్గొంటారని ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడిన తీరును ఖండిస్తున్నానని అన్నారు. కొత్త జిల్లాల ముసాయిదాను స్వాగతిస్తూ 18 మండలాల ప్రజలు లేఖలు ఇచ్చారని చెప్పడం వాస్తవం కాదని వారు తెలిపారు. కొంతమంది జెడ్పీటిసీలు ఇచ్చిన లేఖలను ఆధారంగా తీసుకుని ప్రజాభిప్రాయంగా చెప్పడం భావ్యం కాదని అన్నారు. వనపర్తిని జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చినా నిరంజన్‌రెడ్డిని ప్రజలు గెలిపించలేదని ఆమె చెప్పారు.
ప్రజాభిప్రాయాన్ని విస్మరించారు: పొన్నాల
ఇలాఉండగా పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించారని ఆయన విమర్శించారు. విధి, విధానాలు లేవని, పారదర్శకత లేదని ఆయన విమర్శించారు. దీనిని నిరసిస్తూ శని, ఆదివారాలు ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లా చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.