ఆంధ్రప్రదేశ్‌

‘ఎన్టీఆర్ జలసిరి’కి రూ.1500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, వనరుల యాజమాన్యం, లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడం లక్ష్యంగా సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాన్ని ఖరారు చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఆయన రూ.1500 కోట్లతో చేపట్టిన ఎన్టీఆర్ జలసిరి ప్రాజెక్టును ఉన్నతాధికారులతో సమీక్షించారు. మొత్తం 1.25 లక్షల బోర్ వెల్స్ తవ్వడం, వాటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, వ్యవసాయానికి సమృద్ధిగా భూగర్భ జలాలు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. ఐదు హెచ్‌పి సోలార్ వ్యవసాయ పంపుసెట్ అమర్చేందుకు ఐదు లక్షల చొప్పున ఖర్చవుతుందన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలు ఆరు వేలు, ఇతర వర్గాలు రూ.25 వేలు భరించాల్సి ఉంటుందన్నారు. ఇంతవరకు 9500 పంపుసెట్లను తవ్వారన్నారు. రెండవ దశ కింద 13 జిల్లాల్లో ఆరువేల బోర్‌వెల్స్ తవ్వారు. ఈ నెల 30లోగా ఎన్టీఆర్ జలసిరి కింద తవ్విన 1550 గొట్టపు బావులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆయన విద్యుత్ శాఖను ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులను పేదలకు గృహ నిర్మాణం పనుల్లో వినియోగించనున్నట్లు చెప్పారు. దీనివల్ల 90 రోజుల పాటు కార్మికులకు పని దొరుకుతుందన్నారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ రాసి సూత్రప్రాయంగా అనుమతి తీసుకోనున్నట్లు చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ అభివృద్ధి పనులకు రూ. 4424 కోట్లను వెచ్చించామని, మంచి పనులు సాధించినందుకు జాతీయ అవార్డును పొందినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో 13099 గ్రామ పంచాయతీల్లో 35 లక్షల కుటుంబాలకు జాతీయ ఉపాధి హామీ కింద 60 లక్షల పనిదినాలను కల్పించామన్నారు. గ్రామీణ వౌలికసదుపాయాల కింద సిసి రోడ్లు, డ్రెయిన్లు, గ్రామ పంచాయతీ, మండల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వాటర్ షెడ్, ఉద్యానవన తోటలు, భూగర్భ జలాల రీచార్జింగ్, వ్యవసాయ చెరువులు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు.
ఎన్టీఆర్ జలసిరి ప్రాజెక్టు సమీక్షలో పాల్గొన్న అధికారులు