తెలంగాణ

పరికరాల కొనుగోలుకు జిల్లాల్లో కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాల అవసరాలకోసం వివిధ వస్తువులు కొనుగోలు చేసేందుకు జిల్లాస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్ర్తి, శిశు సంక్షేమ కార్యదర్శి జగదీశ్వర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దుర్గాబాయ్ కేంద్రాలకు అవసరమైన పరికరాలు, యంత్రాలు, ముడిసరకు కొనుగోలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ చైర్‌పర్సన్‌గా మరో నలుగురు అధికారులను సభ్యులుగా నియమిస్తున్నారు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ఎన్‌ఐసి డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ సభ్యులుగా ఉండే ఈ కమిటీకి డిఎంఎస్‌వికె జిల్లా మేనేజర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.