తెలంగాణ

5నుంచి ఆన్‌లైన్‌లో తుది దశ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు తుది దశ కౌనె్సలింగ్‌ను ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్టు కాలేజీయేట్ కమిషనర్ టి విజయకుమార్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు తొలిసారిగా ఆన్‌లైన్ విధానం ‘దోస్త్’ను అమలులోకి తెచ్చింది. సీట్ల కోసం ఆన్‌లైన్‌లో 2,39,506 మంది రిజిస్టర్ చేసుకున్నారు. నాలుగు దశల్లో అవకాశాలు కల్పించిన తర్వాత 130 ప్రభుత్వ కాలేజీలతో పాటు 1086 డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల మెరిట్ ప్రాతిపదికపై 1,97,520 మందికి సీట్లు వచ్చాయి. మరో 22,615 మందికి కోర్టు ఆదేశాలతో సీట్లు కేటాయించారు. మొత్తం మీద 2.20 లక్షల మందికి వివిధ కాలేజీల్లో సీట్లు దక్కాయి. అయితే దోస్త్ ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నా సీట్లు దక్కని విద్యార్థులు దాదాపు ఆరు వేల మంది మిగిలిపోయారు. మిగిలిన విద్యార్థులు వేరే కోర్సుల్లో చేరారు. వీరంతా అతితక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్లనే సీట్లు దక్కించుకోలేకపోయారని తమ విశే్లషణలో తేలిందని విజయకుమార్ వివరించారు. మరో పక్క పలు వర్గాల నుండి ఇంకో విడత అడ్మిషన్లు చేపట్టాలనే డిమాండ్ రావడంతో తుది విడత కౌనె్సలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. పాత విద్యార్థులు మరోమారు రిజిస్ట్రేషన్ చేసుకోనక్కర్లేదని, కొత్తవారు ఎవరైనా గతంలో దరఖాస్తు చేయని వారు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.