తెలంగాణ

కాశ్మీర్‌లో అంగుళం భూమిని వదులుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 3: కా శ్మీర్‌లో అంగుళం భూమి వదులుకోవడానికి 125 కోట్ల భారతీయులు సిద్ధం గా లేరని, పాక్ ఉగ్రవాద సం స్థల ప్రేరేపితంతోనే కాశ్మీర్‌లో అల్లర్లు జరుగుతున్నాయని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థల కార్యక్రమాలు భారత్‌లో చెల్లవని భారత సైనికులు ఎప్పటికప్పుడు రుజువుచేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ అన్నారు.
మహబూబ్‌నగర్‌లో బిజెపి ఆధ్వర్యంలో శనివారం జరిగిన తిరంగా యాత్ర ర్యాలీలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అప్పన్నపల్లి నుం డి జడ్పీ గ్రౌండ్ వరకు కేంద్ర హోం మంత్రి హన్స్‌రాజ్ స్వయంగా బుల్లె ట్ నడుపుతూ యువతను ఉత్సాహపరుస్తూ తిరంగా యాత్రలో పాల్గొన్నారు. అనంతరం జడ్పీ మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తిరంగా యాత్ర దేశవ్యాప్తంగా కో ట్లాది మంది యువతకు దేశభక్తిని పెంపొందించిందని వెల్లడించారు. ఆగస్టు 15న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరంగా యాత్రను ఆగస్టు 23వ తేదీ వరకు నిర్వహించాలని ప్రారంభించినప్పటికీ తెలంగాణలో మాత్రం సెప్టెంబర్ 17 వరకు నిర్వహించాలని సూచించారని అన్నా రు. 1948 సెప్టెంబర్ 17వ తేదీ ఓ చరిత్రాత్మకమైన ఘటన అని, భారతదేశంలో నిజాం సంస్థానం విలీనమైందని అప్పుడే ఈ ప్రాంతానికి స్వా తం త్య్రం వచ్చిందన్నారు. ఈ దినాన్ని కర్ణాటక, మహారాష్టల్ల్రోని ఏడు జిల్లాల్లో ప్రజలు పండుగ జరుపుకుంటారని, కానీ ఇక్కడ మాత్రం జరపకపోవడం విడ్డూరమన్నారు. ఇక్కడ నిజాం పేరు చెప్పి ఓట్లు అడిగే వారు ఉండడం దౌర్భాగ్యం అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, దేశం కోసం నరేంద్రమోదీ సారథ్యంలో తామంతా రాత్రింబవళ్లు కష్టపడుతుంటే పాకిస్తాన్ ఓర్వలేకపోతోందన్నారు. పాకిస్తాన్ పెంచిపోషిస్తున్న పలు ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్‌లో రెండుశాతం యు వతను తప్పుదోవపట్టించే విధం గా వ్యవహరిస్తూ కాశ్మీర్‌లో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను భారత్ అణచివేస్తుంద ని, ఉగ్రవాదుల మూలలను దేశంలో లేకుండా చేస్తుందని హెచ్చరించారు.

చిత్రం..మహబూబ్‌నగర్‌లోని జడ్పీ మైదానంలో నిర్వహించిన తిరంగా యాత్ర బహిరంగసభలో ప్రసంగిస్తున్న
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్.

20శాతం మందికే
ఉద్యోగాలు వస్తున్నాయి
కాన్పూర్ ఐఐటి మాజీ డైరెక్టర్ సంజయ్ గోవింద్ దండే
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, సెప్టెంబర్ 3: దేశంలో అనేకమంది విద్యార్ధులు ఉన్నత చదువులు చదివి, డిగ్రీలు పొందుతున్నప్పటికీ కేవలం 20శాతం మందికి మాత్ర మే ఉద్యోగాలు వస్తున్నాయని, ఇం దుకు విద్యార్థుల్లో సరైన నైపుణ్యం లేకపోవడమే కారణమని కాన్పూరు ఐఐటి మాజీ డైరెక్టర్ సంజయ్‌గోవింద్ దండే అన్నారు. శనివారం వరంగల్ నిట్‌లో జరిగిన 14 స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా 1451 మంది విద్యార్థులకు ఆయన డిగ్రీలు ప్రధానం చేసారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా రాణించాలని అన్నారు. కేవలం విద్యార్థులు చదువుపై దృష్టిసారించడం, ఉత్తీర్ణత సాధించి డిగ్రీలు తీసుకుంటే సరిపోదని ఇతర రంగాల్లో కూడా నైపుణ్యం సాధించాలని కోరా రు. అయితే, కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో కూడా మార్పులు రావాలన్నారు. ప్రతి విద్యార్ధి విద్యార్థి దశనుండే అన్ని రంగాల్లో పట్టుసాధించే విధంగా ఉండాలన్నారు. రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్న వరంగల్ క్రమక్రమంగా పట్టు సాధించి నేడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా ఎదిగిందని, నిట్ ఇంజనీరింగ్ విభాగంగా పట్టు సాధించిందని, నిట్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశం ఉందని అన్నారు. నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ జిఆర్‌సి రెడ్డి మాట్లాడుతూ కళాశాల ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో నిట్ ఫ్యాకల్టీ, ఫ్రొఫెసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఎన్‌ఐటి స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న ముఖ్య అతిథి సంజయ్ గోవింద్ దండే. హాజరైన విద్యార్థులు
ఈ-కోర్టులతోనే న్యాయం
కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేయాలి హైకోర్టు న్యాయమూర్తులు రాజశేఖర్‌రెడ్డి, నవీన్‌రావు

సుల్తానాబాద్, సెప్టెంబర్ 3: అధునాతన టెక్నాలజీ ద్వారా ఈ-కోర్టులను వినియోగించుకోవాలని, సమయం వృథా కాకుండా కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయమూర్తి పి.నవీన్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కోర్టు ఆవరణలో 4 కోట్ల 10 లక్షలతో నిర్మించనున్న జూనియర్ సివిల్ జడ్జి భవన నిర్మాణ పనులకు వారు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. న్యాయమూర్తులకు మెజిస్ట్రేట్ అజార్‌హుస్సేన్ ఆధ్వర్యంలో జిల్లా జడ్జిలు, న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.రేణుక అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి జిల్లాలోని న్యాయమూర్తులు అవిశ్రాంతంగా పనిచేయాల్సి ఉందన్నారు. కేసులు పెండింగ్ కాకుండా చూడాలన్నారు. హైదరాబాద్ బార్ కౌన్సిల్ మెంబర్ కె.లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటయ్యే కోర్టును ఈ-కోర్టుగా ఏర్పాటు అయితేనే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, మాజీ అధ్యక్షుడు నాంపల్లి నారాయణతో పాటు పలువురు న్యాయవాదులు మాట్లాడతూ పెద్దపల్లి జిల్లా అవుతున్నందున, కొత్తగా ఏర్పడే జిల్లా కోర్టును సుల్తానాబాద్‌లోనే ఏర్పాటు చేయాలన్నారు. సుల్తానాబాద్ కోర్టుకు ఇన్‌చార్జి జడ్జిలు కాకుండా పూర్తి స్థాయిలో జడ్జిని ఏర్పాటు చేయాలని వారు కోరగా వీటిని తాము పరిశీలిస్తామని హైకోర్టు న్యాయమూర్తులు అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖర్‌రెడ్డి
మజ్లిస్ మెప్పు కోసం
టిఆర్‌ఎస్ ఆరాటం
తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణను మరిచిన ప్రభుత్వం
యువతలో జాతీయభావం పెంపొందించేందుకు కృషి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్
జడ్చర్ల, సెప్టెంబర్ 3: దేశంలోని యువతలో జాతీయ భావాలను పెంపొందించి వారిలో దేశభక్తిని ఇనుమడింపచేసేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరంగా యాత్రను నిర్వహించడానికి రూపకల్పన చేశారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తిరంగా యాత్ర సభలో పాల్గొనడానికి వెళ్తున్న ఆయన మార్గమాధ్యంలోజాతీయ రహదారిపై గల ఆర్‌అండ్‌బి అతిథి గృహం లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్‌తో కలిసి స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడారు. డెభై సంవత్సరాల క్రితం అనేక మంది మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతం త్య్రం వచ్చిందని, అలాంటి మహానీయుల త్యాగాలను స్మరించుకోవడం కోసం దేశ వ్యాప్తంగా 70 మంది మంత్రులు తిరంగా యాత్రను నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయో ధుల త్యాగాలను స్మరిస్తూ వారి జీవిత చరిత్రలను ప్రజలకు తెలియజెప్పడమే ఈ యాత్ర ఉద్దేశమని ఆయన వివరించారు. 1948 సంవత్సరం సెప్టెంబర్ 17న అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభా య్ పటేల్ నిరంకుశ నిజాం ప్రభువుల పాలన నుండి 16 జిల్లాలతో కూడిన హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వ హించకుండా మాజీ ముఖ్యమంత్రులు వైఎస్.రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్‌రెడ్డి అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కాకముందు అనేకమా ర్లు డిమాండ్ చేసి ముఖ్యమంత్రి అయ్యాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం మజ్లిస్ పార్టీతో మైత్రి వీడటానికి భయపడి ముఖ్యమంత్రి విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు.

జడ్చర్లలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర
అధ్యక్షుడు లక్ష్మణ్, చిత్రంలో హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం