తెలంగాణ

నలుగురు నేరస్థులపై పిడి యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 4: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు నేరాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసులకు కంటి మీద కనుకులేకుండా చేస్తున్న మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు నేరగాళ్లపై కరీంనగర్ జిల్లా పోలీసులు పిడి యాక్టు ప్రయోగించారు. మహారాష్టల్రోని పర్బని జిల్లా భూరి గ్రామానికి చెందిన లవకుష్ ప్రభు బోంస్లే (38), ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల చెక్‌పోస్టు సరస్వతినగర్‌కు చెందిన వనముల తిరుపతయ్య అలియాస్ మధుసూదనరావు అలియాస్ రాజు (55), పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైఎస్సార్‌కాలనీకి చెందిన చెక్క వీర వెంకట సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు (40), ఇదే జిల్లా అంబారిపేట మండలం ఒక్కలంక గ్రామానికి చెందిన బుడితి శ్రీనివాసరావు (40) అనే నలుగురిపై పిడి యాక్టు కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ నేరగాళ్ల నేర వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 కేసులు నమోదు కాగా, జిల్లాలో ఆరు కేసులు నమోదయ్యాయని, ఇటీవలే కోరుట్ల పోలీసులు వీరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారని ఆయన తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వీరిపై పిడి యాక్టు కింద కేసులు నమోదు చేశామని, నిర్బంధ ఉత్తర్వులను నేరస్థులకు జైలులోనే అందజేశామని చెప్పారు. ఇందులో తిరుపతయ్య గతంలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తూ పలు అక్రమాలకు పాల్పడడంతో సర్వీసు నుంచి తొలగించారని తెలిపారు.