తెలంగాణ

ఆలోచన మంచిదే.. ఆచరణపైనే అభ్యంతరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, సెప్టెంబర్ 4: పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం చేస్తున్న ఆలోచన మంచిదైనప్పటికీ, ఆచరణపైనే అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయని రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ‘జనగామ జిల్లా ఏర్పాటు-చారిత్రిక ఆవశ్యకత’ అనే అంశంపై తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ జిల్లా జనగామ జూబ్లీగార్డెన్‌లో సదస్సు నిర్వహించారు. డి. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు జెఎసి చైర్మన్ కోదండరామ్‌తో పాటు రాజకీయ విశే్లషకులు వేణుగోపాల్ హాజరై సుధీర్ఘ ఉపన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటు ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, శాస్ర్తియంగా చేస్తే ప్రజల్లో ఎలాంటి అయోమయం ఉండదన్నారు. ఆ విధానాలను విస్మరించడం వల్లే పలు ప్రాంతాల్లో ప్రజలు జిల్లాల కోసం ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. జనాభాతో పాటు చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను పరిగణలోకి తీసుకొని జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలన సౌలభ్యం పేరుతో ప్రాంతాల గత చరిత్రను విస్మరించడం సరైన పద్ధతి కాదని అన్నారు.
ప్రతి ప్రాంతం ఏదో ఒక అస్థిత్వ చరిత్ర కలిగి ఉంటుందని, అదే ఆ ప్రాంత ప్రజలు గొప్పగా భావిస్తారన్నారు. ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రజలు ఏదో ఒక పద్ధతిలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతారని గుర్తుచేశారు. జనగామ ప్రాంతం సాయుధ పోరాటం నుంచి గొప్ప చరిత్ర కలిగి ఉందనే వాస్తవాన్ని ప్రపంచం గుర్తించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గమనంలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రాంతం ఆథ్యాత్మికంగానే కాక ప్రజా చైతన్యంలో ముందుండి అనేక పోరాటాలు చేసిన ఘనత కలిగి ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి జనగామను జిల్లాగా ప్రకటించాలని కోరారు. తాను యాదాద్రి జిల్లాకు వ్యతిరేకం కాదనే విషయాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని అన్నారు. నల్గొండకు భువనగిరి, ఆలేరు ప్రాంతాలు దూరంలో ఉన్నందున ప్రత్యేక జిల్లా అవసరమని అన్నారు. రాజకీయ విశే్లషకుడు వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ పాలనలో నిజాంను తలపిస్తున్నారని అన్నారు. ప్రజల ఆలోచనలను పట్టించుకోకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లాల ఏర్పాటులో తన నిజస్వరూపం బయటపడిందన్నారు. పురాతన చరిత్రలు కలిగిన ప్రాంతాలను విభజిస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జనగామ ప్రాంత ప్రజలు అనేక మాసాలుగా జిల్లా కావాలని ఆందోళనలు చేస్తుంటే జిల్లా ఇవ్వకుండా, ఎవరు అడగని హన్మకొండను జిల్లా ఇస్తాననడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కెసిఆర్ మాటల్లో శాస్ర్తియత వినిపిస్తుందే తప్ప ఆయన చేతల్లో కనిపించడం లేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం మితిమీరిందని అన్నారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి, జిల్లా సాధన జెఎసి చైర్మన్ దశమంత్‌రెడ్డి, ప్రతినిధులు కన్న పరుశరాములు, డా. లక్ష్మీనారాయణ, డా. రాజవౌళి, కోడం కుమార్, సోమేశ్వర్, దాసరి కళావతి, జోగు అంజయ్య, ఆకుల వేణు, పిట్టల సత్యం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న టిజెఎసి చైర్మన్ కోదండరాం

దేవాదుల పైపులైన్‌కు లీకేజీ
వెంకటాపురం, సెప్టెంబర్ 4: వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని నల్లగుంట గ్రామశివారులో ఉన్న దేవాదుల పైపులైన్ ఆదివారం లీక్ అయింది. దీంతో నీరు సుమారు 50 మీటర్ల ఉవ్వెత్తున ఎగసిపడి మూడు గంటలపాటు వృథాగా పోయాయ. కోట్ల రూపాయలు వెచ్చించి గోదావరి నీటిని గ్రామాలకు అందిస్తున్న క్రమంలో అధికారుల నిర్లక్ష్యంతో లీకేజీలై నీరు వృథాగా పోతున్నాయ.