తెలంగాణ

పెసరకు గిట్టుబాటు కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: పెసర పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. బుధవారం నాడు కేంద్ర మంత్రులు ఉమాభారతి, రాధా మోహన్‌సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ను మంత్రి హరీశ్‌రావు కలిసి పలు ప్రతిపాదనాలు కేంద్రం ముందుంచారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిసి పెసర పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరామన్నారు. కేంద్రం ప్రకటించిన రాయితీ విడుదల చేయాలని కోరామని, దీనిద్వారా పెసర రైతులకు క్వింటాలుకు రూ.5,275 ధర లభిస్తున్నట్లు చెప్పారు. పెసరను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సిఐ, నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు.