తెలంగాణ

అక్టోబర్ 2న కోదండరాం వౌనదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ప్రజాసమస్యలపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజాక్) సమరశంఖం పూరించింది. ఇప్పటికే వివిధ అంశాలపై ఆందోళనలు, సదస్సులు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా రైతాంగ సమస్యలపై 2016 అక్టోబర్ 2 న హైదరాబాద్‌లో ఒకరోజు వౌనదీక్ష చేపట్టాలని టిజాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిర్ణయించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని విపక్షాలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో కూడా ఆయన చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ రంగంలో అనేక సమస్యలున్నప్పటకీ, వీటిని ప్రభుత్వం పరిష్కరించలేకపోతోందన్న భావన రైతుల్లో ఉంది. రైతుల ఆత్మహత్యలు కొనసాగడం పట్ల ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, వాస్తవంగా అమలవుతున్న అంశాలకు ఎలాంటి పొంతనా ఉండటం లేదని భావిస్తున్నారు. సాగునీటి సరఫరాకు పెద్దఎత్తున నిధులు వ్యయం అవుతున్నప్పటికీ, వెంటనే రైతులకు లబ్దిచేకూరడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నప్రాజెక్టులపై 800 కోట్ల నుండి 1000 కోట్ల రూపాయల వరకు నిధులు వ్యయం చేస్తే లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయని టిజాక్ భావిస్తోంది. అయితే ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు కాకుండా మరో ఐదేళ్లు, పదేళ్ల తర్వాత సాగునీటిని ఇచ్చేందుకు రూపొందించిన నీటిపారుదల ప్రాజెక్టులకే వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తోందని, దాంతో ప్రభుత్వంపై వత్తిడి తెవాలని భావిస్తున్నారు. గత ఏడాది కరవుకు గురైన ప్రాంతాల్లో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ, ఇవి నేటికీ రైతులకు అందలేదన్న ఆరోపణలున్నాయి. 2015-16లో పత్తికి మంచి ధర లభించగా, పత్తివిస్తీర్ణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేసింది.
చెరకు రైతులు గత దశాబ్దకాలంగా అనేక బాధలు పడుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అమలు చేయలేకపోతోందన్న విమర్శలున్నాయి. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఉండాలని దీనివల్ల ఈ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేందుకు వీలవుతుందని టిజాక్ భావిస్తోంది. ఈ అంశాలతో పాటు తాజాగా ఎదురవుతున్న రైతాంగ సమస్యలపై సవివరంగా చర్చించి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై వత్తిడి తేవాలన్నదే టిజాక్ ఉద్దేశమని స్పష్టమవుతోంది.