తెలంగాణ

మృత్యుంజయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి, సెప్టెంబర్ 8: ఆడుకుంటూ వెళ్లి నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బోరుబావిలో పడిపోయిన ఓ చిన్నారిని తండావాసులు ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి కాపాడడంతో బాలుడు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఈ సంఘటన గురువారం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గౌరారంతండాలో జరిగింది. తండాకు చెందిన లత, గోపాల్ దంపతుల కుమారుడైన కార్తీక్ (2) గురువారం సాయంత్రం ఇంటికి సమీపంలోని పాత బోరుబావి వద్ద ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. దీనిని గమనించిన బాలుడి కుటుంబీకులు పెద్దపెట్టున కేకలు వేయడంతో తండాకు చెందిన గిరిజనులంతా తరలివచ్చి హుటాహుటిన బోరుబావి చుట్టూ మూడు మీటర్ల లోతు వరకు మట్టి తవ్వారు. అదృష్టవశాత్తు బాలుడు కూడా బోరుబావిలో మూడు మీటర్ల లోతు వరకే వెళ్లి, అక్కడే చిక్కుకుపోయాడు. దీంతో తండాకు చెందిన గిరిజనులు తక్షణమే స్పందించడంతో బాలుడు బతికి బయటపడ్డాడు.