తెలంగాణ

మాజీ మంత్రి మాణిక్‌రావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు/ హైదరాబాద్, సెప్టెంబర్ 8: రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన రాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎం మాణిక్‌రావు (86) గురువారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబీకులు నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం నుంచి ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మాణిక్‌రావు 14ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేశారు. పివి నరసింహారావు, జలగం వెంగళరావు, టి అంజయ్య, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రుల హయాంలో ఆయన కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. మాణిక్‌రావుకు ముగ్గురు కుమారులు, కుమార్తె, భార్య ఉన్నారు. మాణిక్ రావు మృతితో తాండూరు నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
1931 సెప్టెంబర్ 5న జన్మించిన మాణిక్‌రావు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఆయన తన 15వ ఏట అప్పటి నిజాంసర్కార్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి విద్యార్థి నేతగా సారథ్యం వహించి పోరాట పటిమను చాటారు. దాంతో నిజాం పాలకులు ఆయనను అరెస్ట్ చేయించి జైలుపాలు చేశారు. దాంతోపాటు మాణిక్‌రావును హైదరాబాద్ సంస్థానం పరిధిలోనుంచి వెలివేశారు. 1946 నుండి 1958 వరకు ఆయన నిర్బంధ జీవితం గడపాల్సి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ రాజకీయ జీవితంలోకి అడుగిడిన మాణిక్ రావు1959-64 మధ్య కాలంలో తాండూరు పంచాయతీ సమితి ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రజాసేవకు అంకితమయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీచిన 1983లోనూ మాణిక్ రావు తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులందరిలోకి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు.
పలువురు నేతల సంతాపం
మాణిక్‌రావు మృతి పట్ల తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, మాజీ ఎంపి, టిపిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు