తెలంగాణ

ఐటిదే భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణలో ఐటి, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆటో మొబైల్, ఇంజనీరింగ్ రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. సాఫ్ట్‌వేర్ రంగంతో సమానంగా ఐటి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగాలకు మంచి భవిష్యత్తు ఉందని, ఈ రంగాల్లో గణనీయమైన ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రోజు రోజుకు సాంకేతిక రంగంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే భవిష్యత్తులో డ్రైవర్ లేకుండా కార్లు, బస్సులు నడిచే రోజులు వస్తాయని అన్నారు. గచ్చిబౌలిలోని జడ్‌ఎఫ్ గ్రూప్ సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. హైదరాబాద్ ఇండియా టెక్నికల్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన జడ్‌ఎఫ్ గ్రూప్‌తో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి సమక్షంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, జడ్‌ఎఫ్ గ్రూప్ ఇండియా సీనియర్ మేనేజర్ మమతా చామర్తి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభించనున్న జడ్‌ఎఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంపెనీలో మరో నాలుగేళ్లలో 2500 మంది ఇంజనీరింగ్ నిపుణులు పని చేయనున్నారని కెటిఆర్ తెలిపారు.
కాగా త్వరలోనే టి-హబ్ రెండవ దశను ప్రారంభించనున్నట్టు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. టి-హబ్ ఇన్నోవేట్ ఫర్ డిజిటల్ ఇండియా చాలెంజ్‌ను కెటిఆర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ డిజిటల్ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సిలికాన్ వ్యాలీలో టి-హబ్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని కెటిఆర్ తెలిపారు. ఐటి రంగాన్ని మాత్రమే కాకుండా ఆటో మొబైల్ రంగానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రోత్సహిస్తుందని కెటిఆర్ చెప్పారు.

చిత్రం.. జడ్‌ఎఫ్ గ్రూప్‌తో కుదిరిన ఒప్పంద పత్రాలను మంత్రి కెటిఆర్ సమక్షంలో మార్చుకుంటున్న
ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, జడ్‌ఎఫ్ గ్రూప్ ఇండియా సీనియర్ మేనేజర్ మమతా చామర్తి