తెలంగాణ

నదినే గుంజేస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: కృష్ణా జలాలను ఆంధ్ర అక్రమంగా తరలించుకు పోతోందని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అక్రమంగా సాగుతోన్న నీటి తరలింపు వ్యవహారాన్ని అధ్యయనం చేయడానికి నీటి పారుదల శాఖ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. నీటిపారుదల శాఖ ఓఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్ పాండే, నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ సునీల్, జకీర్‌లతో ఏర్పాటైన బృందం ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి జలాలను ఎలా అక్రమంగా తరలిస్తున్నారన్న అంశాన్ని పరిశీలించింది. కర్నూలు జిల్లాలోని పెన్నా బేసిన్‌లో ఉన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తున్నట్టు అధ్యయన బృందం ఆధారాలను సేకరించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల కాంప్లెక్స్‌ను ఈ బృందం సందర్శించి నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు తరలిస్తున్న నీటిపై ఆంధ్రప్రదేశ్ అధికారుల లెక్కలకు, అక్కడ వాస్తవంగా ప్రవహిస్తున్న నీటి లెక్కలకు పొంతన లేదని అధ్యయన బృందం ఆధారాలను సేకరించింది. రోజుకు కనీసం రెండు టిఎంసి కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగు గంగ ప్రాజెక్టుకు తరలిస్తున్నారని అధ్యయన బృందం ఆధారాలు సేకరించింది. పోతిరెడ్డిపాడు పేరుకే కాల్వ కానీ, ప్రవాహ ఉధృతి చూస్తే కాల్వా? నదా? అనే అనుమానం కలుగుతుందని కేంద్రానికి అందించబోయే ఆధారాల్లో పొందుపర్చినట్టు సమాచారం. రికార్డుల్లో వందల క్యూసెక్కులు చూపుతూ, వాస్తవానికి 22 వేల క్యూసెక్కులు తరలించుకు పోతున్నారని నిజ నిర్థారణ బృందం పేర్కొంది. పోతిరెడ్డిపాడు ద్వారా రికార్డులకు దొరకకుండా భారీఎత్తున కృష్ణా జలాలను అక్రమంగా రాయలసీమకు తరలిస్తున్నారని ఈ బృందం చెబుతోంది. రికార్డులో రాసిన దాని ప్రకారం మొదటి రోజు 700 క్యూసెక్కులు అంటూ మొదలుపెట్టి, తర్వాత వెయ్యి, పదిహేను, ఇరవై అయిదు వందలంటూ కాకిలెక్కలు చూపిస్తున్నారని తెలిపారు. చూపుతున్న లెక్కలు 3500 నుంచి 4800 క్యూసెక్కులు కాగా, తరలించిన జలాల పరిమాణం చాలా ఎక్కువగా ఉందని ఈ బృందం తన నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం. పోతిరెడ్డిపాడు కాల్వలో 22వేల క్యూసెక్కుల నీరు ఉధృతంగా ప్రవహిస్తోందని తెలిపారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శితోపాటు తెలంగాణ ఇంజనీర్లు స్వయంగా చూసి ధ్రువీకరించుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం నుంచి కేవలం 27 రోజుల్లో 37నుంచి 47 టిఎంసి నీటిని అక్రమంగా తరలించినట్టు స్పష్టమైందని చెప్పారు. పైన కురిసిన వర్షాల వల్ల దాదాపు 200 టిఎంసి నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరాలి. కానీ ఆ నీరు చేరకుండానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా కాల్వను నదిలా చేసి అక్రమంగా తోడుకున్నారని అంటున్నారు. రికార్డుల్లో 14 టిఎంసి నీటిని చూపుతున్నా, వాస్తవానికి 45 టిఎంసి నీటిని తోడుకున్నారని అధికార్లు చెబుతున్నారు. జల దోపిడీని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి అవసరమైన ఆధారాలన్నీ సేకరించినట్టు అధికారులు తెలిపారు. కృష్ణా జలాల పంపకం వివాదంపై ఈ ఆధారాలు అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. కృష్ణా నదిలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కితే మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు పుష్కలంగా సాగు జలాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.