తెలంగాణ

కొత్త జిల్లాలపై 22న నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: జిల్లాల పునర్విభజనపై ఈ నెల 21 లేదా 22న తుది నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల పునర్ విభజనపై గత నెల 22న ముసాయిదా విడుదల చేసిన విషయం తెలిసిందే. ముసాయిదాలోని ప్రతిపాదిత జిల్లాలు, డివిజన్లు, మండలాలపై అభ్యంతరాలు, సూచనలను ప్రజల నుంచి స్వీకరించడానికి ఇచ్చిన నెల రోజుల గడువు ఈ నెల 20న ముగియనుంది. వారం రోజుల్లో ఈ గడువు ముగియనుండటంతో ఇప్పటి వరకు అందిన ఆర్జీలను క్రోడీకరించి అధ్యయనం చేయడంలో భూ పరిపాలనా శాఖ నిమగ్నం అయింది.
ప్రతిపాదిత జిల్లాల్లో హన్మకొండ జిల్లా మినహా మిగతా జిల్లాలన్నింటినీ యథాతథంగా తుది నోటిఫికేషన్‌లో చేర్చనున్నట్టు అధికార వర్గాల సమాచారం. హన్మకొండకు బదులుగా వరంగల్ రూరల్ జిల్లాను ప్రకటించే అంశాన్ని ముఖ్యమంత్రి పరిశీలనలో ఉండటంతో తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రికే వదిలేసినట్టు అధికారి ఒకరు తెలిపారు. కాకతీయ లేక భద్రకాళి పేరుతో వరంగల్ రూరల్ జిల్లాను ప్రకటించాలని ముఖ్యమంత్రి ఆసక్తితో ఉన్నట్టు ఈ వర్గాల సమచారం.
ఇలా ఉండగా ముసాయిదాపై సోమవారం సాయంత్రం వరకు 51,494 అభ్యంతరాలు, సూచనలు అందగా గడువు ముగిసే వరకు ఈ సంఖ్య 70 వేలకు చేరుకునే అవకాశం ఉందని వీటిని అధ్యయనం చేస్తున్న భూ పరిపాలనశాఖ అంచనా వేస్తుంది. అందిన వాటిలో ప్రతిపాదిత జిల్లాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ సంఖ్యలో ఆర్జీలు అందాయి. జిల్లాలపై 28,642, రెవిన్యూ డివిజన్లపై 13,314, మండలాలపై 9,538 ఆర్జీలు అందాయి. వీటిలో అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 12,093 అందగా, అతి తక్కువగా ఖమ్మం జిల్లా నుంచి 871 ఆర్జీలు అందాయి. జిల్లాలపై అత్యధికంగా అభ్యంతరాలు అందిన జిల్లాల్లో నల్లగొండ జిల్లా 10,316 ఆర్జీలతో ప్రథమ స్థానంలో నిలువగా, 9,884 ఆర్జీలతో మహబూబ్‌నగర్ జిల్లా ఉంది. నల్లగొండ జిల్లా యాదాద్రి జిల్లాలో చేర్చిన జనగామను జిల్లా చేయాలని అత్యధికంగా ఆర్జీలు అందగా, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలను జిల్లా చేయాలని కోరుతూ అత్యధికంగా ఆర్జీలు అందాయి.
ఇక డివిజన్లలో చేర్పులు, మార్పులను కోరుతూ అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి 10,843 ఆర్జీలు అందగా, వరంగల్ జిల్లా నుంచి 1095 ఆర్జీలు అందాయి. మండలాలలో చేర్పులు, మార్పులను కోరుతూ అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 2522 ఆర్జీలు అందగా, కరీంనగర్ జిల్లా నుంచి 1671, నల్లగొండ జిల్లా నుంచి 1623 ఆర్జీలు, రంగారెడ్డి జిల్లా నుంచి 958, ఆదిలాబాద్ జిల్లా నుంచి 478 ఆర్జీలు అందాయి. వచ్చిన ఆర్జీలను అనుసరించి కొత్తగా మరో 30 జిల్లాలను తుది నోటిఫికేషన్‌లో చేరే అవకాశం ఉందని తెలిసింది. ముసాయిదాలో 45 మండలాలను ప్రకటించగా తుది నోటిఫికేషన్‌లో ఈ సంఖ్య 75కు చేరుకోనుందని సమాచారం.