తెలంగాణ

రాస్తారోకోలు... ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/ఆదిలాబాద్/సెప్టెంబర్ 13: ఓ వైపు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించేందుకు జిల్లా అధికార యంత్రాంగమంతా అన్ని ప్రక్రియలు వేగంగా పూర్తి చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వం జారీచేసిన జిల్లాల ముసాయిదాపై కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల అదే తీరుగా ఆందోళన కార్యక్రమాలు మంగళవారం కూడా కొనసాగాయి. సిరిసిల్ల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతుండగా, టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దీక్షా శిబిరం సమీపంలో కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి, కెటిఆర్, కెసిఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో కొందరు దీక్షా శిబిరంపైకి దూసుకురావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు సిద్ధం కాగా, ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోగా, పోలీసులు రంగప్రవేశం చేశారు. తదుపరి ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకుగాను భారీగా పోలీసులను మోహరింప జేశారు. అలాగే సిరిసిల్ల జిల్లా సాధన కోసం సిరిసిల్ల పట్టణంలో జెఎసి ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 28వ రోజుకు చేరాయి. ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సుమారు వెయ్యి మంది గ్రామస్తులు మంగళవారం 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌జామైంది. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జమ్మికుంట మండలంలోని వావిలాలను మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ వావిలాల మండల సాధన కమిటి ఆధ్వర్యంలో గ్రామస్థులు జమ్మికుంట పట్టణంలోని గాంధీచౌక్‌లో ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
వావిలాల గ్రామంలో ఆమరణ దీక్ష చేపట్టిన శిబిరాన్ని పోలీసులు భగ్నం చేసి దీక్ష చేస్తున్న నలుగురిని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. గంభీరావుపేట మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేసే కామారెడ్డి జిల్లాలో కలపాలని కోరుతూ నర్మాల గ్రామస్థులు ధర్నా చేపట్టారు. కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలంటూ హుస్నాబాద్, కోహెడల్లో, రుద్రంగిని మండల కేంద్రంగా ప్రకటించాలంటూ రుద్రంగిలో, కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలంటూ కోరుట్లలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి.
అశాస్ర్తియంగా జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల వెనకబడిన ప్రాంతాలు మరింత వెనకబాటుకు గురయ్యే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ అన్నారు. మంగళవారం జిల్లా సంరక్షణ సమితి అధ్వర్యంలో జెఏసి చేపట్టిన రిలే దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. ఎలాంటి శాస్ర్తియత లేకుండా రాజకీయ లబ్ధికోసం టిఆర్‌ఎస్ నేతలు నిర్మల్ జిల్లాను తెరపైకి తీసుకొచ్చారన్నారు.
బెల్లంపల్లిలో 80 శాతం మంది సామాజిక వర్గానికి చెందిన వారని, దీనిన జిల్లా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనన్నారు. అభివృద్ధిలో వెనకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాను మూడు ముక్కలుగా విభజించడం సరికాదని, నిర్మల్ జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఆశాస్ర్తియంగా నిర్మల్ జిల్లాను ఏర్పాటు చేసినట్లయితే ఆదిలాబాద్ ప్రాంతం మరింత వెనకబాటుకు గురవుతుందన్నారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను
దగ్ధం చేస్తున్న అఖిలపక్షం నేతలు