తెలంగాణ

హెచ్‌ఎంఎస్ ఐక్యఫ్రంట్ విజయ ఢంకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, సెప్టెంబర్ 13: నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టియుసిపై హెచ్‌ఎంఎస్ ఐక్య ఫ్రంట్ విజయ ఢంకా మోగించింది. మంగళవారం జరిగిన పోలింగ్‌లో 693కు గాను 664 ఓట్లు పోలయ్యాయి. వీటిలో హెచ్‌ఎంఎస్ ఐక్య ఫ్రంట్ 311, ఐఎన్‌టియుసికి 290, బిఎం ఎస్‌కు 62, ఎన్‌టికెకు 1 ఓటు లభించాయి. ప్రధానంగా హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టియుసిల మధ్య పోరు కొనసాగింది. ఈ రెండు యూనియన్లు మేమంటే మేమే గెలుస్తామంటూ చివరి క్షణం వరకు ధీమాను వ్యక్తపరిచాయ. ఒక సమయంలో ఐఎన్‌టియుసి గెలుస్తుందని ఊహించినప్పటికీ ఎన్టీపీసీ ఉద్యోగులు అనూహ్యంగా ఓటుతో తీర్పును మార్చేశారు. కాగా, గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐక్యఫ్రంట్ తన ప్రత్యర్థి ఐఎన్‌టియుసిపై 21 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు కౌంటింగ్ అనంతరం ఎన్నికల ప్రధాన అధికారి ప్రతాప్, లేబర్ అధికారి ఆర్‌ఎల్.సాహా, హెచ్‌ఆర్ అధికారి రమేష్ వెల్లడించారు. ఓటింగ్ ప్రక్రియ ఇవిఎంల ద్వారా కొనసాగింది. బిజెపి అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్ ఈ ఎన్నికల్లో పదుల సంఖ్యలో ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా హెచ్‌ఎంఎస్ ఐక్యఫ్రంట్ గెలుపుతో నాయకులు, ఉద్యోగులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ఎన్టీపీసీ అడ్రినిస్టేషన్ బిల్డింగ్ నుంచి టౌన్‌షిప్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐక్యఫ్రంట్ నేత ఉపేందర్ మాట్లాడుతూ ప్రత్యర్థి సంఘం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఉద్యోగులు మాత్రం నిజాయితీకే ఓటు వేసి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ విజయం ఉద్యోగులదేనని స్పష్టం చేశారు. ఎన్టీపీసీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు. సంబురాల్లో ఫ్రంట్ నేతలు మాధవరావు, పెద్దంపేట శంకర్, రవీందర్ రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సొమారపు అరుణ్ కుమార్, గట్టయ్యతోపాటు వందల సంఖ్యలో ఎన్టీపీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

విజయోత్సవాలు జరుపుకుంటున్న హెచ్‌ఎంఎస్ ఐక్యఫ్రంట్ నేతలు