తెలంగాణ

టి.ఎమ్సెట్-3 అభ్యంతరాల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణలో నిర్వహించిన ఎమ్సెట్-3 అభ్యంతరాల పరిశీలన కార్యక్రమం మొదలైంది. నిబంధనల ప్రకారం సిలబస్‌కు లోబడి ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం జరిగిందని ఎమ్సెట్-3 కన్వీనర్ డాక్టర్ యాదయ్య తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అభ్యంతరాలను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ప్రశ్నాపత్రాన్ని నిపుణులతోనే రూపొందించామని, అలాగే సిలబస్‌ను పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు. వివిధ అభ్యంతరాలపై సిలబస్ కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కొన్ని ప్రశ్నలను భిన్నంగా ఇచ్చినా, సిలబస్‌కు లోబడి ఇచ్చామని కన్వీనర్ చెప్పారు. 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తామని ఆయన వివరించారు. కాగా విద్యార్థులు కొంత మంది 15 పొరపాట్లు వచ్చాయని ఫిర్యాదు చేయగా, మరికొంత మంది 22 వరకూ పొరపాట్లు దొర్లాయని ఫిర్యాదు చేశారు. కాగా 15వ తేదీ సాయంత్రం ఫలితాలను విడుదల చేసేందుకు ఎమ్సెట్ కమిటీ సన్నాహాలు చేస్తోంది.

తెలంగాణ బిఇడి కాలేజీల్లో
నేడు సీట్ల కేటాయింపు

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలోని రెండేళ్ల బిఇడి కోర్సులో చేరేందుకు వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియను బుధవారం నాడు పూర్తి చేస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ ఎ రామకృష్ణ పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు సీడీని ఉస్మానియా యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం 14వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారని, అభ్యర్థులు టిఎస్‌ఎడ్‌సెట్ వెబ్ సైట్‌లోకి వెళ్లి తమ సీట్ల అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని రామకృష్ణ పేర్కొన్నారు. కేటాయించిన కాలేజీలకు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా వెళ్లి రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. అదే రోజు తరగతులు సైతం ప్రారంభం అవుతాయని ఆయన పేర్కొన్నారు.