తెలంగాణ

ఖాయిలాపడిన పరిశ్రమలకు మోక్షం ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఖాయిలాపడిన అజంజాహి ఇండస్ట్రీస్, డిబిఆర్ మిల్స్, ప్రాగాటూల్స్, ఆటో అల్విన్, డక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, ఐడిపిఎల్ కంపెనీ, హెచ్‌సియల్ వంటి కంపెనీలను తిరిగి తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని టిఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే వీటిని తెరిపించి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి హామీ ఇచ్చిందని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. కానీ అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలైనా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. పైగా టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత నిజాం షుగర్స్, సిర్పూర్ కాగజ్ మిల్లు, వరంగల్‌లోని కమలాపూర్‌లో ఉన్న ఏపి రియాన్స్, ఐటిఐఆర్‌లను మూసి వేశారని ఆయన తెలిపారు. ఆటో అల్విన్ ప్రారంభిస్తే తక్కువ ఖర్చుతో బస్ బాడీలను నిర్మించుకోవడమే కాకుండా, కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆయన వివరించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని, ఉన్న వారిని పర్మినెంట్ చేస్తామని అన్నారని ఆయన గుర్తు చేశారు. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రోస్టర్ ప్రకారం దసరా పండుగలోపు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.