తెలంగాణ

వర్సిటీల్లో వివక్షపై చట్టం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, సెప్టెంబర్ 13: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా నేటికి దళితులపై వివక్ష కొనసాగడం సిగ్గుచేటని పలువురు వక్తలు అన్నారు. అత్యున్నత బోధనాలయాల్లో సైతం వివక్ష తారాస్థాయికి చేరిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు ఆరేపల్లి మోహన్ అధ్యక్షతన రోహిత్ చట్టం - డ్రాఫ్ట్‌బిల్లు’ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో ఆధునిక అసమానత - సంస్థాగత హత్యకు రోహిత్ వేముల ఉదాహరణ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టిపిసిపి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక చట్టాలను కఠినంగా అమలు చేస్తేనే యూనివర్సిటీల్లో కొనసాగుతున్న వివక్షతను రూపుమాపగలమని కోదండరాం అన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య యూనివర్సిటీ హత్యగానే చూడాల్సి ఉంటుందన్నారు. నాణ్యమైన విద్యను అన్ని వర్గాల వారికి సమానంగా అందించినప్పుడే వివక్షతను రూపుమాపగలమని పేర్కొన్నారు. రోహిత్ వేముల చట్టాన్ని ఏ విధంగా తీసుకువస్తే న్యాయం జరుగుతుందోనన్న విషయంపై మరింత లోతైన చర్చ జరగాల్సి ఉందన్నారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితల పట్ల వివక్ష చూపిస్తున్నాయని విమర్శించారు. విమల మాట్లాడుతూ గత పాలనలో కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ మోడీ వచ్చిన తరువాత దళితులపైన దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో
జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న పిసిసి నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి