తెలంగాణ

వర్షంలోనే తిరంగా యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: బిజెపి నిర్వహిస్తున్న తిరంగా యాత్ర మంగళవారం వర్షంలోనే కొనసాగింది. హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు నిజాం కళాశాల ఎదురుగా ఉన్న బాబూ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా యాత్ర జరిగింది. ఆ సమయంలో వర్షం కురవడంతో కార్యకర్తలు పలచగా హాజరయ్యారు. పార్టీ దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడు దుష్యంత్ కుమార్, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పార్టీ జాతీయ నాయకుడు ఇంద్రసేనారెడ్డి తదితరులు జాతీయ జెండాలు చేతబట్టి పాదయాత్రగా వెళ్ళారు. దారి పొడవునా కార్యకర్తలు భారత్ మాతాకీ జై, ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారికంగా నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తే రాష్ట్ర మంత్రులు, టిఆర్‌ఎస్ నాయకులు తమను విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని అప్పుడు కెసిఆర్ డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. టిఆర్‌ఎస్ కార్యాలయంలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని డిమాండ్ చేశారు. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని మతానికి ముడి పెట్టరాదన్నారు. హిందు-ముస్లింల మధ్య పేచీ పెట్టినట్లు అవుతుందని టిఆర్‌ఎస్ ఎంపి కవిత చెప్పడం వాస్తవం కాదని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

మంగళవారం హైదరాబాద్‌లో తిరంగా యాత్ర నిర్వహించిన బిజెపి నేతలు