తెలంగాణ

మానవత్వం చాటిన ‘సహృదయ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 13: వరంగల్ నగరంలోని కాజీపేట సహృదయ వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు చోటు మరోసారి తన మానవత్వాన్ని చాటారు. సహృదయ వృద్ధాశ్రమంలో హన్మకొండ కుమార్‌పల్లి ప్రాంతానికి చెందిన ఐలోని బొందమ్మ (85) అనారోగ్యంతో మృతిచెందింది. ఈ మేరకు వారి బంధువులకు సమాచారం ఇచ్చినా ముందుకు రాకపోవడంతో సహృదయ వ్యవస్థాపకుడు చోటునే మంగళవారం ఆమెకు తలకొరివి పెట్టాడు. ఆ వృద్ధ మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు నిరాకరించడంతో బక్రీద్ పండుగ రోజు అయినప్పటికీ సహృదయ వ్యవస్థాపకుడు చోటు తలకొరివి పెట్టి మానవత్వాన్ని చాటుకున్నాడు. బొందమ్మకు భర్త చనిపోగా ఐదు సంవత్సరాల క్రితం కాజీపేట వృద్ధాశ్రమంలో చేరింది. ఇటీవల అనారోగ్యానికి గురికాగా మృతిచెందింది. గతంలో రంజాన్ పండుగ రోజు కూడా స్టేషన్‌ఘనపూర్ ప్రాంతానికి చెందిన కీర్తి శ్రీనివాస్ ఇదే వృద్ధాశ్రమంలో ఉంటుండగానే అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీనివాస్ చనిపోయిన విషయాన్ని వారి కుమారులకు తెలిపినప్పటికీ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో సహృదయ వ్యవస్థాపకురాలు యాకుబీ రంజాన్ పండుగను కూడా లెక్కచేయకుండా తలకొరివి పెట్టి తనలోని మానవత్వాన్ని నిరూపించుకొన్నాడు.

బొందమ్మ మృతదేహానికి తలకొరివి పెడుతున్న
సహృదయ వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు చోటు