తెలంగాణ

మోహరించిన బలగాలు -- నేడు గణేశ నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: గణేశ మండపాల్లో కొలువుదీరిన గణనాథుల నిమజ్జనోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరుగనుంది. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 30వేల మంది పోలీసులను మోహరిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇదిలావుంటే, జిహెచ్‌ఎంసి నిమజ్జనోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు సాధారణ సెలవు దినంగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. సిఎం కెసిఆర్ ఆదేశం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సెలవుకు బదులుగా అక్టోబర్ 12 రెండో శనివారం పనిదినంగా పరిగణిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిమజ్జనోత్సవ భద్రతకు సంబంధించి బుధవారం తన కార్యాలయంలో సిపి మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గణేశ నిమజ్జనానికి సాగర తీరం చుట్టూ 12 వందల సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ పోలీస్‌లకుతోడు, ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ప్రత్యేక దళాలను రప్పించామన్నారు. పోలీసులతోపాటు వివిధ శాఖలకు చెందిన పదివేల మంది సిబ్బంది, ఎన్‌సిసి, ఎనె్నస్సెస్ క్యాడెట్లు, రెండువేల మంది వలంటీర్లు విధుల్లో ఉంటారన్నారు. ఖైరతాబాద్ భారీ గణేశుని శోభాయాత్రను నిర్వాహకులు కోరితే గురువారం ఉదయం నుంచే అనుమతిస్తామని, ఈమేరకు బందోబస్తుకు సిద్ధంగా ఉన్నామని, లేనిపక్షంలో గురువారం సాయంత్రం నుంచే శోభాయాత్ర నిర్వహించుకోవచ్చని సిపి సూచించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నిమజ్జనానికి తరలివచ్చే గణనాథులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని, ఎవరైనా సోషల్ మీడియాలో నిరాధారమైన మెస్సేజ్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శోభాయాత్రలో మహిళల భద్రతకు సుమారు వంద షీ టీమ్‌ల నిఘా ఉంటుందన్నారు. గురువారం ఒక్క రోజే దాదాపు 8వేల విగ్రహాలు నిమజ్జనం కావొచ్చని, సుమారు 10 నుంచి 15వేల మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు కమిషనర్ చెప్పారు. శుక్రవారం భారీగా గణేశ నిమజ్జనం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లావైపు నుంచి వచ్చే గణేశ శోభాయాత్రకు అంతరాయం కలుగకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టామని, నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా సీనియర్ ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. నాగులకుంట- మక్కామసీదు ప్రాంతంలో ఐజి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎంజె మార్కెట్ వద్ద ఐజి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, అంబేద్కర్ విగ్రహం వద్ద ఐజి మల్లారెడ్డి, తెలుగుతల్లి విగ్రహం వద్ద ఐజి ఆర్‌బి నాయక్, సిసిఎస్ ఆఫీసు వద్ద ఐజి చారుసిన్హా, అఫ్జల్‌గంజ్ వ్ద డిఐజి అకున్ సబర్వాల్ సైదాబాద్ వద్ద డిఐజి శివశంకర్‌రెడ్డి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారని కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. గణేశ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.