తెలంగాణ

ప్రతిభే ప్రామాణికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: జిల్లాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్‌తో పాటు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కలెక్టర్లు, ఎస్పీల ఎంపికపై సిఎం కె చంద్రశేఖర్‌రావు కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. జిల్లాల పునర్విభజనపై విడుదల చేసిన ముసాయిదాకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి విధించిన గడువు ఈనెల 20తో పూర్తవుతుంది. తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేశాక, అక్టోబర్ 11నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్న విషయం తెలిసిందే. తుది నోటిఫికేషన్‌తో పాటు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ శర్మ నుంచి కెసిఆర్ ఇదివరకే నివేదికలు తెప్పించుకున్నారు. సీనియార్టీ, ప్రతిభ, పనితీరు ఆధారంగా కలెక్టర్లు, ఎస్పీల పోస్టుల్లో నియమించడానికి ప్రతిపాదిత జాబితాలను ముఖ్యమంత్రికి ఇప్పటికే అందాయి. రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల నుంచి ఇటీవల పూర్తయిన హరితహారం వరకు వారి ప్రతిభ ఆధారంగా కలెక్టర్లు, ఎస్పీలుగా పోస్టింగ్‌లు ఇవ్వడానికి అందిన ప్రతిపాదిత జాబితాపై గత నాలుగైదు రోజులుగా ముఖ్యమంత్రి కసరత్తు చేశారు. ప్రతిపాదిత జాబితాను వడబోసి కొత్తగా ఏర్పాటు చేయనున్న 17 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించబోయే అధికారులను సిఎం ఎంపిక చేసినట్టు తెలిసింది. అవసరమైన దానికంటే ఎక్కువ సంఖ్యలోనే వీరిని ఎంపికచేసి వారిలో కొందరికి పోస్టులు ఇచ్చి, మిగతా వారిని స్టాండ్ బై జాబితాలో పెట్టాలని సిఎం కెసిఆర్ నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల్లో ప్రాధాన్యత కలిగిన జిల్లాలు కొన్నింటికీ ప్రస్తుతం కలెక్టర్లు, ఎస్పీలుగా విధులు నిర్వహిస్తోన్న వారిని నియమించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించడానికి వేర్వేరు మార్గాల ద్వారా ముఖ్యమంత్రి నివేదికలు తెప్పించుకున్నట్టు చెబుతున్నారు. వీరిలో ప్రతిభ, పనితీరుకు పెద్దపీట వేసి ముఖ్యమంత్రి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాల ప్రతిఫలాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించడానికి చిత్తశుద్ధి, అంకితభావంతో పని చేసే అధికారులనే కలెక్టర్లు, ఎస్పీలుగా ఎంపిక చేసినట్టు సమాచారం. జిల్లాల పునర్విభజన తుది నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే వీరికి నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు వరకు తమకు పోస్టింగ్‌లు ఇచ్చిన జిల్లా కేంద్రాల్లో వీరు బాధ్యతలు స్వీకరించి కొత్త జిల్లాల ఏర్పాటు పనులను పర్యవేక్షించనున్నారని తెలిసింది. ఎంపిక చేసిన కొత్త కలెక్టర్లు, ఎస్పీలతో ఈనెల 25 లేక 26న ముఖ్యమంత్రి సమావేశమవుతారని అంటున్నారు. కొత్త జిల్లాల్లో ఏవిధంగా నడుచుకోవాలో సిఎం వీరికి ఇదే సమావేశంలో మార్గనిర్దేశం చేయనున్నట్టు సమాచారం.