ఆంధ్రప్రదేశ్‌

అపోహలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలతో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందగలదని, అసలు ఇంతకంటే మేలైన ప్యాకేజీలు ఉండబోవని, హోదావల్ల ఒనగూడే దానికంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.ఈ రాష్ట్రానికి చెందిన ఎంపి కాకపోయినా రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎంతగానో తహతహలాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును నిందిస్తుంటే ఈ రాష్ట్రానికి తీరని అన్యాయమే జరుగుతుందంటూ హెచ్చరించారు. ఈ రాష్ట్రం అథోగతి పాలైతే అప్పుడు ప్రజల నుంచి ఎదురయ్యే అసంతృప్తితో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే తహతహ తప్ప విపక్షాలకు ఈ రాష్ట్ర ప్రయోజనాలేవీ పట్టటం లేదన్నారు. అవసరమైతే ఈ ప్యాకేజీలన్నింటికీ కేంద్రం చట్టబద్ధత కల్పించగలదన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగింది. రేపు ఈ ప్యాకేజీలలో కమిషన్‌లు పోతే ఒరిగేదేమీ లేదన్న అపోహలు సరికావని, ఏదో జరుగుతుందని అసలు ప్యాకేజీలనే తిరస్కరిస్తామా అని కావూరి అన్నారు. పోలవరాన్ని కేంద్రం కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే పరిగణిస్తూ అందుకయ్యే వ్యయాన్ని భరించడానికి సిద్ధంగా ఉందని, విద్యుత్ ఉత్పాదనకు కేంద్రంగా కూడా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోందని కేంద్రం ప్రకటించే నిధులు సరిపోతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
ప్యాకేజీతోనే ఎక్కువ నిధులు* మంత్రి పత్తిపాటి
శ్రీ కాళహస్తి: ప్రత్యేక హోదా కన్నా కేంద్రం ప్రకటించిన ప్యాకేజితో రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వివరించారు. బుధవారం శ్రీ కాళహస్తి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎక్కువనిధులు వస్తాయనే ఉద్దేశ్యంతో డిమాండ్ చేసింది వాస్తవమేనని అన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించిందని, దీని వల్ల హోదాకన్నా ఎక్కువ నిధులు వస్తాయని స్పష్టం చేశారు.

తూ.గోలో
కుంభవృష్టి
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 14: తూర్పులోని గోదావరి జిల్లాలో తీర ప్రాంతమైన రాజమహేంద్రవరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలో భయంకరమైన ఉరుములతో భారీ వర్షం పడింది. కుండపోతగా సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు, పల్లపు ప్రాంతాలే కాకుండా రహదారులన్నీ జల దిగ్భంధమయ్యాయి. రాజమహేంద్రవరంలోని సీతంపేట, కోటిలింగాలపేటలో ఇళ్ళల్లోకి వర్షపు నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదిలా వుండగా తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఏజెన్సీలోనూ, మెట్ట, మైదాన ప్రాంతాలతో పాటు కోనసీమ తదితర అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. రాజానగరం, రంగపేట, వడిశలేరు, సీతానగరం మండలం మునికూడలి, కోరుకొండ మండలం గాడాల తదితర చోట్ల వర్షపు నీరు రోడ్లపైకి వచ్చింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దేవీపట్నం, మారేడుమిల్లి, రంపచోడవరం, వై.రామవరం, చింతూరు, వి ఆర్ పురం, కూనవరంలో కూడా భారీ వర్షం కురిసింది.

దుర్గగుడి మూసివేత!
విజయవాడ (ఇంద్రకీలాద్రి), సెప్టెంబర్ 14: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో పవిత్రోత్సవాలు ప్రారంభం సందర్భంగా బుధవారం అమ్మవారికి 12 గంటలకు నివేదన చేసిన తరువాత ఆలయాన్ని మూసివేశారు. గురువారం వేకువజామున ఆలయ అర్చక స్వాములు అమ్మవార్లకు స్నపనాభిషేకం, ప్రత్యేక పూజలు తదితర వైదిక కార్యక్రమాలు దేవస్థానం స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పిదప ఉదయం 9 గంటల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ పవిత్రోత్సవాలు ఈ నెల 14 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

పులి‘చింత’లు తీరుతాయ:దేవినేని

అచ్చంపేట, సెప్టెంబర్ 14: కృష్ణా డెల్టా రైతాంగానికి సాగు, మంచినీరు అందించాలన్న ఆశయం పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో నెరవేరుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో పులిచింతలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో బుధవారం మంత్రి ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ ప్రాజెక్టు అధికారులతో వరదనీటి పరిస్థితిపై సమీక్షించారు. వాగులు, వంకల నుంచి వచ్చే ప్రతి నీటిచుక్కనూ భద్రపర్చాలని సూచించారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న వరదనీటిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కనీసం 30 టిఎంసిల నీటిని ప్రాజెక్టులో నిల్వ ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రాజెక్టులు వరదనీటితో నిండిపోయినట్లు సమాచారం ఉందన్నారు. వచ్చే రబీ సీజన్‌కు రైతులకు సాగునీరు అందించేందుకు ఇకపై ఇబ్బందులు ఉండబోవన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 870 అడుగులకు మించి నీరు రావడం లేదన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నీటి సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. ప్రాజెక్టుపై నిర్మించిన జలవిద్యుత్ కేంద్రం ట్రయల్ రన్ నడుస్తోందని మంత్రి విలేఖర్లకు తెలిపారు. జలవిద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. దిగువకు వదులుతున్న వరదనీటితో ప్రమాదం ఉందని, జాలర్లు నదిలోకి వెళ్లవద్దని అప్రమత్తం చేయాలన్నారు.

జిజిహెచ్‌లో నలుగురు వైద్యుల సస్పెన్షన్

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, సెప్టెంబర్ 14: గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఐసియులో చికిత్స పొందుతున్న శిశువు మృతి చెందాడు. దాసరిపాలేనికి చెందిన భవానీ అనే మహిళకు జన్మించిన మగబిడ్డ చనిపోయినట్లు సర్ట్ఫికెట్ ఇచ్చిన జీజీహెచ్ వైద్యులు తమ తప్పు తెలుసుకుని ఐసియులో చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూ పసికందు బుధవారం ఉదయం మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు వైద్యుల నిర్వాకంగానే తమ బిడ్డ దక్కలేదని ఆందోళనకు దిగారు. ముందు చనిపోయినట్లు చెప్పి తమను ఇంటికి పంపటం వల్ల చికిత్సలో జాప్యం జరిగిందని ఆరోపించారు. అయితే వైద్యులు మాత్రం పసిబిడ్డకు మలద్వారం లేనందునే మృతిచెందాడని స్పష్టం చేస్తున్నారు. నిర్ణీత గడువుకు రెండు నెలలు ముందుగానే కాన్పు కావడంతో పాటు మలద్వారంలేని కారణంగా బతికే అవకాశాలులేవని ముందుగానే వివరించామని తేల్చిచెప్పారు. దీంతో తల్లిదండ్రులు విషణ్ణ వదనాలతో బిడ్డ మృతదేహాన్ని మూటకట్టుకుని ఇంటి ముఖం పట్టారు. జరిగిన సంఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికుండగానే చనిపోయాడని సర్ట్ఫికెట్ ఇచ్చినందుకు బాధ్యులైన వైద్యులు నలుగురినీ సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ ఇంటిపై ఏసిబి దాడులు

ఆంధ్రభూమిబ్యూరో
విజయనగరం, సెప్టెంబర్ 14: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం విజయనగరం గ్రామీణ నీటి సరఫరాశాఖ ప్రాజెక్టు విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్.విద్యాసాగర్ కార్యాలయం, ఇంటిపైన దాడులు జరిపారు. ఎసిబి అధికారులు జరిపిన సోదాలలో ఇప్పటివరకు 1.76 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు గుర్తించారు. విజయనగరం ఎసిబి డిఎస్పీ లక్ష్మీపతి తెలిపిన వివరాల ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యాసాగర్ అక్రమంగా ఆస్తులు సంపాదించారని వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విజయనగరంలోని ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం, కంటోనె్మంట్‌లోని ఆయన నివాసం, వైజాగ్‌లోని మూడుచోట్ల ఎసిబి సిబ్బంది ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖలో మూడు ఫ్లాట్లు, శ్రీకాకుళంలో రెండు ఇంటిస్థలాలు ఉన్నట్లు గుర్తించారు. వీటికితోడు పోస్టల్, బ్యాంకు డిపాజిట్ల పత్రాలను కూడా ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలలో కూడా పెద్దమొత్తంలో నగదు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.