తెలంగాణ

తెలంగాణ ఎమ్సెట్ -3లో ఏపి అమ్మాయి టాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణలో జరిగిన ఎమ్సెట్ -3లో ఏపి అమ్మాయి మానస టాపర్‌గా నిలిచింది. మెడికల్, డెంటల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల భర్తీకి నిర్వహించిన ఎమ్సెట్-3 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. గుడివాడకు చెందిన రేగెళ్ల ప్రఫుల్ల మానస 160 మార్కులకు 152 మార్కులు సాధించి, అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో పి శ్రీహారిక (సికింద్రాబాద్), మూడో స్థానంలో తప్పెట తేజస్విని (అనంతపురం) నిలిచింది. జెఎన్‌టియుహెచ్ యుజిసి అకడమిక్ స్ట్ఫా కాలేజీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జెఎన్‌టియు విసి ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ డాక్టర్ ఎన్ యాదయ్య, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో మండలి చైర్మన్ ఫలితాల సిడితోపాటు తుది కీని సైతం విడుదల చేశారు. పరీక్షలో 22 తప్పులు వచ్చాయని విద్యార్ధులు, తల్లిదండ్రులు తమ అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్సెట్ కమిటీ 8 ప్రశ్నలను తొలగించి అందరికీ 8 మార్కులు కలిపింది. మరో ఐదు ప్రశ్నలకు ఒకటికి మించి కరెక్ట్ సమాధానాలు ఇవ్వడంతో వాటిని కూడా కలిపి మొత్తం 13 ప్రశ్నల విషయంలో పొరపాట్లు జరిగినట్టు ఎమ్సెట్ కమిటీ అంగీకరించింది. తొలగించిన 8 ప్రశ్నల్లో ఏడు ప్రశ్నలకు అసలు సరైన సమాధానాలు లేవని, ఒక ప్రశ్న సిలబస్‌లో లేనిది వచ్చిందని చెప్పారు. ఎనిమిది ప్రశ్నల్లో ఒకటి బోటనీ నుండి మూడు ఫిజిక్స్ నుండి నాలుగు కెమిస్ట్రీ నుండి తొలగించామని వివరించారు. అభ్యర్ధులు అందరికీ 8 మార్కులను కలపడంతో ఈసారి ఎమ్సెట్‌లో కేవలం 70 మంది మాత్రమే అనర్హులయ్యారు. ఎమ్సెట్-2లో ఏడో ర్యాంకు సాధించిన తేజస్విని ఎమ్సెట్-3లో మూడో ర్యాంకు సాధించింది.
పరీక్షకు 37,180 మంది హాజరుకాగా, అందులో 37,163 మంది అర్హత సాధించారు. 259 క్వాలిఫైయింగ్ పరీక్ష వివరాలు అందలేదని దాంతో వారికి ర్యాంకులను కేటాయించలేదని పేర్కొన్నారు. అర్హత సాధించిన వారిలో 12222 మంది బాలురు కాగా, 24612 మంది బాలికలు ఉన్నారు. మైనార్టీ అభ్యర్ధులు 309 మంది అర్హత సాధించారు.
16వ తేదీ ఉదయం 10 గంటలకు అభ్యర్ధుల ఒఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని అభ్యంతరాలు ఉంటే వాటిని కన్వీనర్ దృష్టికి తీసుకురావచ్చని కన్వీనర్ యాదయ్య తెలిపారు. సాధారణ అభ్యర్ధులు 5వేలు, ఇతరులు 2వేలు ఫీజుగా చెల్లించాలని చెప్పారు.
అర్హత సాధించిన వారు

కేటగిరి బాలురు బాలికలు మొత్తం
ఎస్టీ 1380 1580 2960
ఎస్సీ 2263 4734 6997
ఒసి 2731 6304 9035
బిసి-ఇ 1051 2640 3691
బిసి-డి 1719 3228 4947
బిసి-సి 153 448 601
బిసి-బి 2090 4003 6093
బిసి-ఎ 835 1675 2510
మొత్తం 12222 24612 36834
-----------
మైనార్టీల వివరాలు
క్రైస్తవులు 5 26 31
జైన్‌లు 2 0 2
ముస్లింలు 89 186 275
ఇతరులు 0 1 1
మొత్తం 96 213 309

టిఎస్ ఎమ్సెట్-3 ఫలితాలను విడుదల చేస్తున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి

మానస (1)

శ్రీహారిక (2)

తేజస్వి (3)