తెలంగాణ

రొమ్ము కాన్సర్‌కు ఉచిత చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: మహిళల్లో రొమ్ము కాన్సర్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్టవ్య్రాప్తంగా ఉచిత మొబైల్ బ్రెస్ట్ కాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంఎన్‌జె కాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఫైజర్ కంపెనీ సహకారంతో ఈ కార్యక్రమం శుక్రవారంనుంచీ అమలు కానుంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని బాదేపల్లిలో ఈ మొబైల్ శిబిరాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఒక వాహనం ద్వారా కాన్సర్ పరీక్షలు జరుపుతారు. మామోగ్రఫీ, ఎక్స్‌రే యూనిట్లు, బయాప్సి చేసే ప్రత్యేక యూనిట్ ఈ మొబైల్ వాన్‌లో అందుబాటులో ఉంటాయి. ఎంఎన్‌జె నుంచి నిపుణులైన ఇద్దరు డాక్టర్లు, టెక్నిషియన్లు, ముగ్గురు నర్సులు కూడా అందుబాటులో ఉంటారు. పరీక్షలు ఉచితంగానే జరుగుతాయి. అవసరం అయితే బయాప్సి కూడా అక్కడే చేస్తారు. ఒకవేళ బ్రెస్ట్ కాన్సర్ ఉందని తేలితే తదుపరి చికిత్సను కూడా ఉచితంగానే చేస్తారు. రెండో దశలో తెలంగాణ అంతటా ఈ మొబైల్ వ్యాన్లు అందుబాట్లోకి వస్తాయి.