తెలంగాణ

శోభాయమానంగా నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆది దేవుడి నామస్మరణతో భాగ్యనగరం పులకరించింది. జైబోలో గణేష్ మహారాజ్‌కీ జై..! గణపతి బొప్పా మోరియా..అనే నినాదాలతో వినాయక్‌సాగర్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డూను ఈసారి రూ. 14.65లక్షలకు నగర శివారు కీసరకు చెందిన స్కైలాబ్ రెడ్డి దక్కించుకున్నారు. ఉదయం కుండపోత వర్షం కురిసినా, భక్తులు ఏ మాత్రం లెక్కచేయకుండా భారీసంఖ్యలో సాగర్‌కు చేరుకుని, గణనాధుడికి వీడ్కొలు పలికారు. మధ్యాహ్నం వాతావరణం తెరపినివ్వడతో ఒంటి గంట నుంచే సాగర తీరం జనసంద్రమైంది. పదిరోజుల పాటు నిత్య పూజలందుకున్న విఘ్నేశ్వరుడి నిమజ్జనం గురువారం ఆద్యంతం భక్తిశ్రద్ధలు, పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఘనంగా కొనసాగింది. నిమజ్జనం కోసం జిహెచ్‌ఎంసి తొమ్మిది చెరువుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కొలనుల్లో, జలవిహార్ వద్ద ఏర్పాటు చేసిన కొలనుల్లో నిమజ్జనం కొనసాగుతోంది. సాయంత్రం సమయంలో ట్యాంక్‌బండ్ క్రేన్ నెంబర్ 20, 1ల వద్ద కరెంటు షాక్ కొడుతుండటంతో జనం హడలెత్తిన స్వల్ప ఘటనల మినహా నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. సాగర్ చుట్టూ ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌లలో ఏర్పాటు చేసిన 34 క్రేన్ల వద్ద సాయంత్రం ఆరు గంటల నుంచి నిమజ్జన ప్రక్రియ ఊపందుకుంది. చార్మినార్ వద్ద బాలాపూర్ గణనాథుడికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతం పలికారు.
హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి
విహెచ్‌పి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్
సనాతనమైన హింధూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని విశ్వ హింధూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ పిలుపునిచ్చారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని చార్మినార్ వద్ధ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి నిమజ్జనానికి తరలివచ్చిన గణనాథులకు స్వాగతం పలికారు.