తెలంగాణ

ఎంసిఐ ఆమోదించినా పెరగని సీట్ల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో సీట్లపై నేటికీ స్పష్టత రాలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన కాలేజీలను సైతం అడ్మిషన్ల జాబితాలో ఇంకా చేర్చకపోవడంతో సీట్ల సంఖ్య అభ్యర్ధులు ఆశించినంతగా పెరగలేదు. ఎమ్సెట్ -3 ఫలితాలను ప్రకటించడంతో పాటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1100 సీట్లు, 14 ప్రైవేటు కాలేజీల్లో 2050 సీట్లు ఉన్నాయి. అలాగే ఒక ప్రభుత్వ డెంటల్ కాలేజీలో వంద సీట్లు, 11 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1140 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం ఏడు ప్రభుత్వ కాలేజీల్లో 1100 సీట్లలో 1050 సీట్లు ఎమ్సెట్ -3 మెరిట్ లిస్టు ప్రకారం భర్తీ చేస్తారు. అలాగే 14 ప్రైవేటు కాలేజీల్లో 2050 సీట్లకు గానూ కన్వీనర్ కోటాలో 1025 సీట్లు భర్తీ చేస్తారు. అంటే కన్వీనర్ కోటాలో 2075 సీట్లు వస్తాయి. ఇక డెంటల్‌లో ప్రభుత్వ కాలేజీలో వంద సీట్లు, 11 ప్రైవేటు కాలేజీల్లో 1140 సీట్లకు గానూ 606 సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి. ఎంబిబిఎస్, డెంటల్ కలిపి 2681 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. అయితే వీటికి తోడు మరో ఐదు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, రెండు డెంటల్ కాలేజీలను ఈ అడ్మిషన్ల జాబితాలోకి చేర్చితే సీట్లు 4940కి పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లు మెరిట్‌పైనా, 35 శాతం మేనేజిమెంట్ కోటాలోనూ, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లోని యాజమాన్య సీట్ల భర్తీ ప్రక్రియ గురువారం నుండి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ప్రైవేటు వైద్య కళాశాలల సంఘం అధికారిక ప్రకటన చేయనుంది. 15వ తేదీ నుండి 19వ తేదీ వరకూ విద్యార్ధులు తమ ధృవపత్రాలను వెబ్‌సైట్లోవ అప్‌లోడ్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ సొమ్ము చెల్లించాలి, దరఖాస్తు చేసుకున్న విద్యార్ధుల ధృవపత్రాలను పరిశీలించాక నీట్ ర్యాంకుల ఆధారంగా అర్హుల జాబితాను రూపొందిస్తారు. ఒయు దూరవిద్యా కేంద్రంలో ఈ నెల 23, 24 తేదీల్లో కౌనె్సలింగ్ నిర్వహిస్తారు. సీటు దక్కిన విద్యార్ధులు మొదటి ఏడాది ఫీజుతో పాటు వచ్చే ఏడాది ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
17 నుండి కన్వీనర్ కోటా సీట్లు
మెడికల్, డెంటల్ అడ్మిషన్ల కౌనె్సలింగ్ షెడ్యూలును కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ ప్రకటించింది. 17వ తేదీ నుండి 20వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు ర్యాంకుల వారీ సర్ట్ఫికేట్ల పరిశీలన జరుపుతారు. వెబ్ కౌనె్సలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను కెఎన్‌ఆర్ మెడికల్ యూనివర్శిటీ ఏర్పాట్లు చేసింది. ఏయే ర్యాంకుల అభ్యర్థులు, ఏయే కేంద్రాలలో సర్ట్ఫికేట్ల పరిశీలన జరిపించుకోవాలో ఆన్‌లైన్‌లో వర్శిటీ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్శిటీ పిజిఆర్‌సిడిఇ, మారేడ్‌పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, గగన్‌మహల్‌లో ఎవి కాలేజీ, వరంగల్‌లో కాకతీయ వర్శిటీ, స్థానికేతర అభ్యర్థులకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలలో కౌనె్సలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివిధ రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు జెఎన్‌టియు కూకట్‌పల్లిలో కౌనె్సలింగ్ ఉంటుంది. 17న ఉదయం 9 గంటలకు స్పోర్ట్స్, గేమ్స్ అభ్యర్థులకు, 18న ఉదయం 9 నుండి ఎన్‌సిసి అభ్యర్థులకు, 19న ఆర్మీ, పోలీసు అమరవీరుల కుటుంబాలకు, పిహెచ్‌సి అభ్యర్థులకు కౌనె్సలింగ్ ఉంటుంది. వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ క్యాంపస్‌లో 1000 ర్యాంకుల వరకూ 17వ తేదీ ఉదయం, 2000 ర్యాంకుల వరకూ 17వ తేదీ సాయంత్రం కౌనె్సలింగ్ జరుగుతుంది. 18న 2001 నుండి 4500 ర్యాంకు వరకూ, 19న 4501 నుండి 9000 ర్యాంకు వరకూ, 20న 90001 నుండి తుది ర్యాంకు వరకూ కౌనె్సలింగ్ జరుగుతుంది.