తెలంగాణ

రాయలంపాడు నిర్వాసితులకు నగదు చెల్లింపుల ప్రయోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో రాయలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే నిర్వాసితులకు చట్టప్రకారం నగదు చెల్లింపుల బెనిఫిట్‌ను వర్తింప చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గ్రామానికి చెందిన 39 మంది హైకోర్టులో లంచ్‌మోషన్‌గా పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎన్‌ఎస్ అర్జున్ కుమార్ వాదనలు వినిపిస్తూ, పోలీసు అధికారుల అండతో రెవెన్యూ అధికారులు గ్రామస్తులను ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. జూరాల డ్యాం నుంచి విడుదలయ్యే జలాల వల్ల గ్రామం ముంపునకు గురవుతోందన్నారు. గ్రామంలోని 1400 కుటుంబాల్లో 200 కుటుంబాలు మాత్రమే కొత్త ప్రదేశంలో ఇండ్లు నిర్మించుకోగలవని, నిధులను అందరికీ ప్రభుత్వం విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుని గ్రామంలో పునరావాస సదుపాయాలు పూర్తి చేయకుండా ఏమి చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వంతో మాట్లాడి వివరాలు తెలుసుకుని కోర్టుకు నివేదిస్తానని తెలిపారు. వచ్చే సోమవారం నాటికి ఈ అంశాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.