తెలంగాణ

ముందే సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: వచ్చే నెల 11వ తేది నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న కొత్త జిల్లాల్లో 7వ తేదీకల్లా సర్వం సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. కొత్త జిల్లాల పురోగతిపై వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో రాజీవ్ శర్మ శుక్రవారం సమావేశమయ్యారు. కొత్త జిల్లాలు కొలువుదీరడానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.
కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలతో పాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాలు 7వ తేదీకల్లా కొలువుదీరేలా భవనాలు, వాహనాలు, ఫర్నీచర్, కంప్యూటర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని రాజీవ్ శర్మ సూచించారు. జిల్లాల్లో సిబ్బంది కూర్పు (స్ట్ఫా స్ట్రక్చర్) ప్రతిపాదనలను వెంటనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సిజిజి) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే అవసరమైన మేరకు సిబ్బంది, ఉద్యోగుల నియామకాల ప్రక్రియను వచ్చే మొదటి వారంకల్లా పూర్తి చేస్తామని ఆయన వివరించారు. గతంలో మాదిరిగా కాకుండా స్ట్ఫా స్ట్రక్చర్‌ను కుదించడం వల్ల ప్రస్తుతం ఉన్న సిబ్బంది, ఉద్యోగులనే చాలావరకు కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయవచ్చని రాజీవ్ శర్మ సూచించారు.
వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు, వ్యాధుల తీవ్రత, స్పెషల్ ప్రోగ్రాములు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని సర్దుబాటు చేయాలని సిఎస్ ఆదేశించారు. ప్రతిశాఖ ద్వారా జిల్లాలలో ఉన్న కార్యాలయాలను సమీక్షించి అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేయాలని ఆదేశించారు. పశువుల సంఖ్యకు అనుగుణంగా వెటర్నరీ ఆస్పత్రులకు వైద్యులు, సిబ్బందిని నియమించాలన్నారు. విద్యాశాఖకు సంబంధించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యాసంస్థలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సంక్షేమ శాఖలన్నింటినీ ఒక అధికారి పర్యవేక్షణ పరిధిలోకి తీసుకు వస్తున్నామని, దీనికి అనుగుణంగానే ఉద్యోగులు, సిబ్బంది నియామకాలపై ప్రతిపాదనలు పంపించాలని రాజీవ్ శర్మ ఆదేశించారు.