ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రాలో లోకేష్ ట్యాక్స్ నడుస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణలో గ్యాంగ్‌స్టర్ నరుూమ్ ట్యాక్స్ వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం లోకేష్ ట్యాక్స్ నడుస్తోందని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను సిఎంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణాలకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు దోపిడీలు, అక్రమాలకే తాము వ్యతిరేకమన్నారు. ప్రభుత్వ విధానపరమైన లోపాలు, అవినీతిని ఎత్తిచూపేందుకే పోరాటం చేస్తున్నామన్నారు. అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు సృష్టించమని, చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేస్తే, సహకరిస్తామన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రతిపక్ష పార్టీని తూలనాడడం సరికాదన్నారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపి రెండోస్ధానంలో ఉందని, త్వరలో నెంబర్ ఒన్‌గా వస్తుందని అనడం పచ్చి అబద్ధమన్నారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపి పదవ ర్యాంకులో ఉంటే, 2వ స్ధానంలో ఉందని విశాఖలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పచ్చి అబద్ధాలు ఆడారన్నారు. పోలవరం కాఫర్ డ్యాం మొదటి దశ పూర్తవుతుందని ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నిజానికి ఆనకట్ట నిర్మాణానికి అడ్డంరాకుండా ఉండేందుకు ఏర్పాటు చేసే కాఫర్ డ్యాంను పూర్తి చేసేసి అదే మొదటి దశ అంటూ ప్రచారానికి తెరదీయడం దారుణమన్నారు. ఎవరైనా ప్రజలు తరఫు పోరాడితే వారిని ఉన్మాదులుగా బాబు చిత్రీకరిస్తున్నారన్నారు. ప్రజారంజక పాలన చేస్తే ప్రజలే చెబుతారని ఆయన అన్నారు. స్విస్‌చాలెంజ్ విధానం లోపభూయిష్టంగా ఉందని సింగిల్ జడ్జి కోర్టు తీర్పు ఇస్తే, దానిపైన చంద్రబాబు రాజకీయ వ్యాఖ్యలు చేయడం తప్పన్నారు. తనమీద కేసులు వస్తే 10 నుంచి 15 సార్లు కోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్నారన్నారు.