తెలంగాణ

చెరువుల్లో చేపలకు వీడియో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: చెరువుల్లోని చేప పిల్లలను కూడా స్వాహా చేసే వారికి చెక్ పెట్టే విధంగా మత్స్య శాఖ కొత్త విధానం అవలంభిస్తోంది. చెరువుల్లో గతంలో చేప పిల్లలను వదిలినట్టు రికార్డుల్లో చూపించేవారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఇకపై చెరువుల్లో చేప పిల్లలు వదిలేప్పుడు ఆ కార్యక్రమం మొత్తాన్ని వీడియోలో రికార్డు చేయాలని పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. చేప పిల్లల సేకరణ టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. గతంలో రాష్ట్ర స్థాయి టెండర్లు పిలిస్తే కొందరు అక్రమాలకు పాల్పడ్డారు. దానికి బదులు జిల్లా స్థాయి టెండర్లు పిలిచినా అక్రమాలకు పాల్పడడంతో వాటిని రద్దు చేసి తిరిగి టెండర్లు పిలిచారు. అక్టోబర్ నాటికి అన్ని జలాశయాల్లోకి చేప పిల్లలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ సిఎం ఒఎస్‌డి
దేశపతి డిప్యుటేషన్ రద్దు
తిరిగి ఉపాధ్యాయుడిగా బదిలీ
మరో పది మంది కూడా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్ డిప్యుటేషన్‌ను రద్దు చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బదిలీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో మొత్తం 11 మంది టీచర్ల డిప్యుటేషన్‌ను రద్దు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను మంత్రులు, శాసనసభ్యులకు సహాయకులుగా నియమించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. వెంటనే డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఆదేశించింది. మెదక్ జిల్లా ములుగులో ప్రభుత్వ టీచర్‌గా ఉన్న దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి చురుగ్గా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత దేశపతి శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి ఓఎస్‌డిగా డిప్యుటేషన్‌పై నియమించారు. డిప్యుటేషన్ రద్దు కావడంతో దేశపతి శ్రీనివాస్‌ను తిరిగి ఉపాధ్యాయునిగా నియమించారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి వద్ద ఉన్న టీచర్ల డిప్యుటేషన్‌ను సైతం రద్దు చేశారు. ఈ 11 మంది పాఠశాలల్లో తిరిగి ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించనున్నారు.

నాపై ఆరోపణలు
లెక్క చేయను

జైళ్ల శాఖ డిజి వికె సింగ్

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, సెప్టెంబర్ 16: అవినీతి రహిత శాఖగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి జైళ్ల శాఖ పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టామని, తమ శాఖలో ఎవరు అవినీతికి పాల్పడినా సహించే ప్రసక్తి లేదని జైళ్ల శాఖ డిజి వికె సింగ్ స్పష్టం చేశారు. తమ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తన విచారణలో వెలుగులోకి వచ్చిందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తాను ఎంత మాత్రం లెక్కచేయనన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని జైలు మ్యూజియాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సింగ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లను తాను రహస్యంగా దర్యాప్తు చేశానని, జైళ్లలో శిక్షలు అనుభవించిన విడుదలై బయటకు వెళ్లిన వారితోపాటు వారి సహచరుల ద్వారా సమాచారం సేకరించినట్లు తెలిపారు. ప్రధానంగా కొన్ని జైళ్లలో అవినీతి, అక్రమాలు కొనసాగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. భువనగిరి సబ్ జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు తనపై వేధింపుల ఆరోపణలు చేసినట్లు ఇప్పటివరకు తన దృష్టికి రాలేదన్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తాను తీసుకునే నిర్ణయంలో మార్పు ఉండదన్నారు. సంగారెడ్డి మండలం కంది జైలు నుంచి తీసుకువచ్చి కోర్టులో హాజరు పర్చిన కరుడుగట్టిన పార్థీ దొంగల ముఠా సభ్యుల పరారీ గురించి ప్రశ్నించగా అది తమ పరిధిలోనిది కాదని, పోలీసులు చూసుకుంటారని సమాధానం ఇచ్చారు.