తెలంగాణ

ఓ పట్టుపడదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ హక్కులకు సంబంధించి గట్టి వాదన వినిపించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యుక్తులవుతున్నారు. శనివారం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సదీర్ఘంగా సమావేశమైన కెసిఆర్, అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ వాదన ఏరీతిన ఉండాలన్న అంశంపై విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది. జల వివాదాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు ఆదేశంతో అపెక్స్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ 21న భేటీ అవుతోన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు రాజకీయ పోరాటంగా మారుతోన్న తరుణంలో, హక్కులను కాపాడుకుంటూనే సర్దుబాటు ధోరణిలోనే వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని తెలంగాణ యోచిస్తున్నట్టు సమాచారం. అయితే, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆంధ్ర సిఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి శనివారం తీవ్రంగా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో, అపెక్స్ కౌన్సిల్‌లో తెలంగాణ వాదన ఏవిధంగా ఉండబోతోందన్న అంశంపై ఆసక్తి రేగుతోంది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని చంద్రబాబుకు చెప్పాలంటూ టి.టిడిపి నేతలను తెరాస కోరుతోన్న విషయం తెలిసిందే. ప్రధానంగా కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తుతోంది. ఈ పరిస్థితుల్లో అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశంలో ప్రధానంగా పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. కృష్ణా జలాల్లో 299 టిఎంసి నీటికి తెలంగాణ హక్కుదారని వాదిస్తూనే, దానిలో భాగంగానే ప్రాజెక్టులు చేపడతున్నట్టు చెబుతూనే, ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులు ఉమ్మడిలో ఉన్నప్పటివేనన్న విషయాన్ని బలంగా వాదించేందుకు తెలంగాణ సన్నద్ధమవుతోంది. మరోవైపు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రకు అక్రమంగా 40 టిఎంసి నీటిని తరలించుకు పోతోన్న అంశాన్నీ అపెక్స్ కౌన్సిల్‌లో పెట్టాలని శనివారం సిఎం నిర్వహించిన సమీక్షలో నిర్ణయించినట్టు సమాచారం.
మరోపక్క ఆంధ్ర సిఎం చంద్రబాబు, రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌తో 21న జరిగే భేటీపై చర్చించినట్టు తెలిసింది. దిగువ రాష్టమ్రైన ఆంధ్రతో సంబంధం లేకుండా కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టులు అక్రమమని అపెక్స్ కౌన్సిల్‌లో వాదించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
జల వివాదాలపై ఇరు రాష్ట్రాల సిఎంల తొలి సమావేశమిది. ఈ భేటీ అత్యంత కీలకమైనది కావడంతో ఇరు రాష్ట్రాల సిఎంలు అపెక్స్ కౌన్సిల్‌లో తమ వాదనలు వినిపించేందుకు కసరత్తు చేస్తున్నారు. శనివారం కెసిఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, ఈఎన్‌సి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోందన్న వాదన లేవదీస్తున్న ఆంధ్రకు ఏవిధమైన సమాధానం చెప్పాలో వ్యూహాన్ని ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రలో ఖరారైనవేనన్న విషయాన్ని బలంగా వాదించేందుకు ఆధారాలతో నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే, గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్టత్రో సామరస్య పూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టే ఆంధ్రతోనూ సామరస్యంగా వ్యవహరిస్తూనే, హక్కులను కాపాడుకునే విధంగా వాదన సాగించాలని వ్యూహాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.