తెలంగాణ

అమరుల మాట మరిచారేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 17: ఎంతో ఘనచరిత్ర కలిగిన ఓరుగల్లుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాకతో తెలంగాణ విమోచన దినోత్సవానికి జాతీయ స్ధాయి గుర్తింపు దక్కుతుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. శనివారం రాత్రి వరంగల్ నగరంలోని జెఎన్‌ఎస్ మైదానంలోజరిగిన బిజెపి బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కుటుంబ పాలన సాగిస్తున్న కెసిఆర్‌కు వరంగల్ సభ నుండే గుణపాఠం ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి రాక ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే తెలంగాణ కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలు గుర్తుకు రాకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జాతీయవాదం బలోపేతం అవుతుంటే తెలంగాణా రాష్ట్రంలో మాత్రం స్వతంత్రం కోసం పోరాడిన అమరులను గుర్తించకపోవడం శోచనీయమని అన్నారు. అమరులను గౌరవించడం, సత్కరించడం మన సాంప్రదాయమన్న ముఖ్యమంత్రి తెలంగాణా విమోచన పోరాట యోదులను ఎందుకు విస్మరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రాగానే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మజ్లిస్ అజెండాను అమలు చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా గుర్తించారు కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కెసిఆర్ గుర్తించకపోతే అమర వీరుల ఆత్మలు ఘోషిస్తాయన్నారు. మజ్లిస్ నుండి విముక్తి జరగాలంటే ఇక్కడ నుండే శ్రీకారం చుట్టాలన్నారు. తెలంగాణను ఏలా సాధించుకున్నామో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అలా సాధించుకోవాలని అన్నారు.
‘తెలంగాణ ప్రజలు
దేశభక్తులు కారా?’
తెలంగాణ ప్రజలు దేశభక్తులు కారా అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ప్రశ్నించారు. త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకొని నిజాంను ఎదిరించి జైలు పాలైన సమరయోధులు విమోచన దినోత్సవం నిర్వహించాలని ఆశిస్తున్నారని చెప్పారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత మాతకి జై అంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు.