రాష్ట్రీయం

మరో 24గంటలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: నైరుతీ బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడ్డ ఉపరితల తుపాను ద్రోణి మూలంగా మంగళవారం ఏపీలోని కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఐఎండి శాస్తవ్రేత్త చరణ్‌సింగ్ పేరిట సోమవారం బులెటిన్ జారీ అయింది. నైరుతీ రుతపవనాలు ఉధ్రుతంగా ఉండటంతో తెలంగాణ, ఏపీల్లో గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని పది జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు. హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాల మూలంగా ట్రాఫిక్ స్తంభించింది. సికింద్రాబాద్ రాణిగంజ్, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్లతోపాటు హైదరాబాద్‌లోని బేగంపేట, పంజగుట్ట, అమీర్‌పేట, నల్లగొండ క్రాస్‌రోడ్స్, చాదర్‌ఘాట్, మోజంజాహీ మార్కెట్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ దూరం గంటకుపైగా స్తంభించాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు నానా తంటాలుపడ్డారు. సోమవారం సాయంత్రం ఆరున్నరకు ప్రారంభమైన వర్షం అరగంటలో సెంటీమీటర్ మేర కురిసినట్టు సమాచారం. అశోక్‌నగర్, నాగమయ్య కుంట, నదీంకాలనీతో పాటు మల్లేపల్లి, కార్వాన్ నియోకవర్గంలోని లంగర్‌హౌజ్ తదితర ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని గోశాల, వైస్రాయ్ సర్కిల్ నుంచి బైబిల్ హౌజ్ వచ్చే రోడ్డు, ఆర్టీసి క్రాస్‌రోడ్డు నుంచి ముషీరాబాద్, సికిందరాబాద్ స్టేషన్ నుంచి వైఎంసిఏ వెళ్లే ప్రధాన రహదారుల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులకే గాక, పాదచారులకు కూడా అడుగడుగున ఇబ్బందులు తప్పలేదు. ఇదిలావుంటే, గత 24 గంటల్లో పాలకొల్లులో ఏడు సెంటీమీటర్ల, గంట్యాడ (విజయనగరం), నల్లబెల్లి (వరంగల్)లలో ఆరేసి సెంటీమీటర్లు, చీపురుపల్లి (విజయనగరం), ఖానాపూర్ (ఆదిలాబాద్)లలో ఐదేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీగా వర్షం కురిసింది.