తెలంగాణ

క్షణ క్షణం..ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌కు వరద నీటి ప్రవాహం పెరిగింది. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వస్తుండటంతో పాటు తాజాగా గురువారం కురిసిన వర్షాల కారణంగా నీటి ఉద్ధృతి మరింత పెరిగింది. కూకట్‌పల్లి, పికెట్ నాలాలతో పాటు దుర్గం చెరువు నుంచి వచ్చే నాలాల వల్ల సాగర్‌లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరటంతో చెరువు దిగువ ప్రాంతాలైన అశోక్‌నగర్, అరుంధతినగర్, గాంధీనగర్, ఫీవర్ ఆసుపత్రి, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల ప్రజల్లో క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వర్షాలు కురుస్తున్న కొద్దిరోజుల నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్డు కుంగిపోవటంతో ట్రాఫిక్‌ను దారి మళ్లించటం, అశోక్‌నగర్ బ్రిడ్జిపై చిన్న రంధ్రం ఏర్పడటం వంటి కారణాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై అనేక రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం అవేమీ నమ్మరాదని, ఆ రకంగా ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. హుస్సేన్‌సాగర్ గరిష్ఠ నీటి మట్టం 514.41 మీటర్లుండగా, బుధవారం కల్లా నీటి మట్టం 513.71 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లోకు తగిన విధంగా బుధవారం వరకున్న 2500 క్యూసెక్కుల నీటి విడుదలను 4వేల క్యూసెక్కులకు పెంచారు. ఇన్‌ఫ్లో వచ్చిన విధంగానే ఔట్ ఫ్లో వెళ్తున్నందున ప్రజలు భయపడాల్సిన పనేం లేదని అధికారులు తెలిపారు. జిహెచ్‌ఎంసి అధికారులు సాగర్‌కు దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లకు తరలించి, వారికి అక్కడే బస, భోజన వసతులు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను 200 మంది హౌజ్ కీపింగ్ సిబ్బందిని కూడా నియమించారు.