తెలంగాణ

ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిద్ధంగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: మరో మూడు రోజుల పాటు భారీ వర్షాల ప్రమాదం పొంచి ఉన్నందున సహాయ కార్యక్రమాల కోసం ఆర్మీని, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ను సిద్ధంగా ఉంచినట్టు మున్సిపల్ మంత్రి కె తారక రామారావు తెలిపారు. భారీ వర్షాలకు నీట మునిగిన పలు ప్రాంతాల్లో కెటిఆర్ పర్యటించారు. వచ్చే రెండు నెలల్లో నగరంలోని రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో వర్షాల వల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. జిహెచ్‌ఎంసితో పాటు జల మండలి, విద్యుత్, పోలీసు, రెవెన్యూ, ఫైర్ తదితర శాఖల ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది నగరంలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. నగరంలో చెరువులు,కుంటల్లో దాదాపు 80శాతానికి పైగా పూర్తిగా నిండాయని, వీటి భద్రతకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినట్టు, ప్రతి చెరువు, కుంటల వద్ద ముందు జాగ్రత్త గా ఇసుక బస్తాలు పెట్టినట్టు, వరద నివారణ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలను మ్యాపింగ్ చేసి ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలను ఆదేశించినట్టు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్‌లో కుంగిన నాలాపై ఉన్నత స్థాయి కన్సల్టెంట్లతో అధ్యయనం చేస్తున్నట్టు, మొత్తం సివరేజ్ వ్యవస్థను సమీక్షిస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు. నగరంలో 99శాతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ వరదలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు.