తెలంగాణ

రాహుల్ రహస్య పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో శుక్రవారం సైతం విద్యార్థుల నిరసనలు కొనసాగాయి. రోహిత్ జన్మదినం శనివారం కావడంతో ఆ కార్యక్రమంలో రోహిత్ కుటుంబీకులతో కలిసి పాల్గొనేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. హెచ్‌సియూకి చేరుకున్న వెంటనే విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ రాకతో వర్శిటీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాహుల్ పర్యటన వివరాలు తమకు తెలియవని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నేతలు చెప్పారు. రాహుల్ పర్యటన గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. రాహుల్ రాత్రి 11.30కు హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రంగా రోహిత్ స్నేహితులు ధర్నా చేస్తున్న టెంట్‌లోనే గడపాలని నిర్ణయంచుకున్నారు. నేటి మధ్యాహ్నం వరకూ విద్యార్ధులతో నిరసనలో పాల్గొన్న తర్వాత, రాహుల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారని తెలిసింది. అనంతరం రోహిత్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాహుల్ రోహిత్ కుటుంబీకులతో మాట్లాడతారని సమాచారం. అనంతరం రాహుల్ వెనుతిరుగుతారని చెబుతున్నారు.
కాగా రాహుల్ రాకను నిరసిస్తూ ఎబివిపి రాష్టవ్య్రాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. శుక్రవారం నుంచి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో తరగతులు యథాతథంగా జరుగుతాయని ఇన్‌చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీవాస్తవ చెప్పినా, అది శుక్రవారం కార్యరూపం దాల్చలేదు. ఒక వర్గానికి చెందిన విద్యార్థులు తమ సెమిస్టర్ నష్టపోయే పరిస్థితి వచ్చిందని, తరగతులు నిర్వహించాలని కోరగా, రోహిత్ డిమాండ్‌లు తీరేంత వరకూ నిరసనలు కొనసాగుతాయని మరోవర్గం విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సైన్స్ బ్లాక్ వద్ద చాలాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తరగతుల నిర్వహణకు సహకరిస్తామని విద్యార్థులు చెప్పారని గురువారమే విసి ఇన్‌చార్జి శ్రీవాస్తవ పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో కొద్దికాలంగా తరగతుల నిర్వహణకు అంతరాయం కలిగిందని, రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నది విద్యార్థుల డిమాండ్‌గా ఉందని చెప్పారు. అయితే అత్యవసర క్లాసులు, ల్యాబ్‌ల నిర్వహణకు హెచ్‌సియు స్టూడెంట్ జాక్ గురువారం అంగీకరించిందని ఇన్‌చార్జి విసి చెప్పారు. ఆ దిశగా విసి ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయారు. ఒకదశలో విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం విసి చేయగా, విద్యార్థులు ఆయనను అడ్డుకున్నారు.
నేడు రాష్టవ్య్రాప్త బంద్
సెంట్రల్ వర్శిటీలో రాహుల్ శవ రాజకీయాలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చినట్టు ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అంబేద్కర్ ఆశయాలకు తూట్లుపొడుస్తూ, యాకుబ్ మెమెన్‌కు మద్దతుగా నిలిచిన వ్యక్తులకు రాహుల్ బాసటగా నిలవడం దారుణమని, రాహుల్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎబివిపి డిమాండ్ చేసింది. సెంట్రల్ వర్శిటీలో ఇపుడిపుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న తరుణంలో, విద్యా వాతావరణానికి భంగం కలిగించే విధంగా రాహుల్ వర్శిటీలో రాజకీయాలు చేయడాన్ని ఎబివిపి తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. అదే చెన్నైలోని మెడికల్ కాలేజీలో దళిత విద్యార్థినులు చనిపొతే రాహుల్ ఎందుకు పరామర్శించలేదని ఎబివిపి ప్రశ్నించింది. ఇప్పటికైనా రాహుల్ శవ రాజకీయాలు మానుకుని హెచ్‌సియులో సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నించాలని జాతీయ కార్యవర్గ సభ్యుడు కడియం రాజు డిమాండ్ చేశారు. ఇదిలావుంటే, తాత్కాలిక విసి శ్రీవాస్తవ కూడా సెలవులో వెళ్లిపోవడంతో, ఇన్‌చార్జి విసిగా ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ బాధ్యతలు తీసుకున్నారు