తెలంగాణ

ఏరూ ఊరూ ఏకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా శుక్రవారం మెదక్ జిల్లాలో ఐదుగురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు, నల్లగొండలో ఇద్దరు మరణించారు. వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలలో అనేక కాలనీలు నీటమునిగాయి. వరంగల్-కరీంనగర్ రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ నగరానికి తాగునీరు అందిస్తున్న వడ్డేపల్లి, భద్రకాళి రిజర్వాయర్లు మత్తడి పోస్తున్నాయి. మాదన్నపేట మత్తడివద్ద ముగ్గురు జాలర్లు చేపలుపట్టే క్రమంలో బలుసుపూరి కృష్ణ (35) మత్యువాతపడ్డాడు. దుగ్గొండి మండలం వెంకటాపురం పెద్ద చెరువుబుంగపడింది. పోనకల్లు కొత్తచెరువు గండిపడింది. కొత్తగూడ- చెన్నరావుపేట-గూడూరు మధ్య వాగులు ఉప్పొంగుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. చేర్యాల మండలంలోని 80 ఇండ్లు కూలిపోయాయి. కేసముద్రం- మహబూబాబాద్ మద్య ఉన్న వట్టివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
సింగూరు ప్రాజెక్టులోకి భారీ వరద వస్తుండటంతో శుక్రవారం మూడు గేట్లను ఎత్తి దిగువకు 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తం చేసారు. ప్రాజెక్టులో 24 టిఎంసిల నీటి నిల్వకు చేరుకోగా ఎగువ నుంచి 90 వేల నుంచి ఒక లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దాంతో అదనపు నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో 41వేల క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు.
పులిచింతలకు తగ్గిన వరద
పులిచింతల ప్రాజెక్టుకు శుక్రవారం వరదనీరు తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులో 30టిఎంసిల నీటిని మాత్రం నిల్వ చేస్తున్నారు. ఏగువ నుండి వస్తున్న 78,702 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని నాలుగు గేట్ల ద్వారా అదేస్ధాయిలో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న తెలంగాణ జెన్-కో విద్యుత్ తయారీ కేంద్రంలో శుక్రవారం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.
నిజామాబాద్ అతలాకుతలం
నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం పెద్దతక్కడ్‌పల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోగా, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నదేవాడ, చిన్నదడ్గి, సిర్‌సముందర్, పుల్కల్, హస్గుల్ కుర్తి తదితర గ్రామాలను కూడా వరద జలాలు చుట్టుముట్టడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. కౌలాస్‌నాలా ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకోగా, శుక్రవారం 36వేల పైచిలుకు క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టుకు చెందిన 7వరద గేట్ల ద్వారా వచ్చిన ఇన్‌ఫ్లోను వచ్చినట్టుగానే దిగువకు విడుదల చేస్తున్నారు.
కౌలాస్ మిగులు జలాలతోపాటు లెండి వాగు సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో బాన్సువాడ - బిచ్కుంద ప్రధాన రహదారిపై పెద్దదేవాడ, రాజుల్లా తదితర అనేక చోట్ల లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల పై నుండి నీరు ఉరకలెత్తుతోంది. దీంతో వాహనాల రాకపోకలను జగన్నాథపల్లి మీదుగా మళ్లించారు. రాంపూర్ వద్ద తాత్కాలికంగా వేసిన బ్రిడ్జి వర్షం ధాటికి కొట్టుకుపోయింది. ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌తోపాటు రామడుగు, సింగీతం, కల్యాణి, అలీసాగర్ రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి.
నల్లగొండ జిల్లాను అల్పపీడన వర్షాలు ముంచెత్తాయి. వరదలతో అద్దంకి-నార్కట్‌పల్లి మార్గంలో రాకపోకలకు దామరచర్ల, పానగల్, తిప్పర్తిల వద్ధ అంతరాయం కల్గింది. గ్రామీణ రహదారులు ధ్వంసమయ్యాయి. మూసీ నది ఉప్పొంగి పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, కట్టంగూర్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే సూర్యాపేట-మిర్యాలగూడ మధ్య కూడా రాకపోకలు స్తంభించాయి.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో అతి భారీ వర్షం కురిసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో 10గేట్లు ఎత్తి 16,900 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. అటు శనిగరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు దూకుతోంది. మోయతుమ్మెద వాగు పొంగిపోర్లుతుండటంతో బస్వాపూర్ వద్ద హుస్నాబాద్- సిద్దిపేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఎల్లమ్మవాగు, ఈదుల వాగు, మూల వాగులో వరద కొనసాగుతోంది. లోయర్ మానేర్ డ్యాం (ఎల్‌ఎండి)కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 24 టిఎంసిల సామర్ధ్యం గల ఎల్‌ఎండిలో ప్రస్తుతం ఆరు టిఎంసిల నీరు నిలువ ఉంది. 32 అడుగుల సామర్థ్యం గల ఎగువ మానేర్ డ్యాంలో ప్రస్తుతం 20 అడుగులకు నీరు చేరింది. సిద్దిపేట -ముస్తాబాద్ రూట్‌లో రాకపోకలు నిలిచిపోయాయి. శభాష్‌పల్లి వాగులో నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో చెరువులు, కుంటలు నిండి ఆలుగు పారుతున్నాయి. కాగ్నానది, దుందుభీనదితో పాటు కృష్ణానది కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టులోకి శుక్రవారం వరద పెరిగింది. జిల్లావ్యాప్తంగా 68 మట్టిమిద్దె ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

చిత్రం.. మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడ్ వద్ద కాలువలో పడ్డ కుమారుడిని రక్షించి ప్రవాహంలో కొట్టుకుపోయ మృతి చెందిన స్వామి