ఆంధ్రప్రదేశ్‌

వెలగపూడిలో సచివాలయానికి రూపురేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సుపరిపాలనకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై ఏర్పాట్లు చేస్తోంది. వెలగపూడిలో పూర్తిస్థాయి సచివాలయ పాలన అక్టోబర్ 3వ తేదీన ప్రారంభం కావాలని ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. వెలగపూడి సచివాలయంలో ఏ శాఖను ఎక్కడ నిర్వహించాలో కూడా వివరించింది. చాంబర్లు కేటాయింపులో ఆర్థిక శాఖకు, సాధారణ పరిపాలన శాఖకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. 30వ తేదీలోగా హైదరాబాద్ సెక్రటేరియట్‌లో ఉన్న తమ శాఖలకు సంబంధించిన ఫైళ్లను డిజిటలైజేషన్ పూర్తి చేసుకుని వాటిని వెలగపూడి సచివాలయానికి తరలించుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్టోబర్ 3 ఉదయం 10 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ పరిపాలన అంతా వెలగపూడి సచివాలయంలోని నాలుగు బ్లాక్‌లలో ప్రారంభం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విజయదశమి నాడు సిఎం కార్యాలయం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్టోబర్ 11న విజయదశమి రోజున బ్లాక్ నెంబర్ -1లోని తమ కార్యాలయం ప్రారంభిస్తారు. 12వ తేదీ నుండి వెలగపూడి సచివాలయంలోనే సిఎం తమ పరిపాలన కొనసాగిస్తారు. అక్టోబర్ 5 నాటికి సిఎం కార్యాలయ భద్రతా ఏర్పాట్లు సైతం పూర్తి చేసి ఆ భవనాన్ని సిఎంఓ అధికారులకు అప్పగిస్తారు. సచివాలయానికి హైదరాబాద్ నుండి తరలివచ్చే మహిళా ఉద్యోగుల కోసం ఎపి ప్రభుత్వం గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్శిటీ ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్కులో 30 అపార్టుమెట్లను అద్దెకు తీసుకుంది. త్రీ బెడ్‌రూమ్ ప్లాట్‌లను ఫర్నీచర్‌తో సహా ఇచ్చేందుకు ఫ్లాట్ ఓనర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంది. ఒక్కో ఫ్లాట్‌లో ఆరుగురు ఉద్యోగినులకు వసతి కల్పిస్తారు. ఒక్కో త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్‌కు 22వేల రూపాయిలు అద్దె చెల్లిస్తారు. మొత్తం 30 ఫ్లాట్‌లలో 180 మంది మహిళా ఉద్యోగినులు ఉండే విధంగా ప్రభుత్వం తాత్కాలిక వసతి సౌకర్యం కల్పించింది. అలాగే మరో పది ఫ్లాట్‌లను కూడా సిద్ధం చేసి ఇవ్వాల్సిందిగా రెయిన్ ట్రీ పార్కు యాజమాన్యాన్ని కోరింది. అవి కూడా అందుబాటులోకి వస్తే మరో 60 మందికి వసతి కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరో పక్క రెయిన్ ట్రీ పార్కు నుండి ఉద్యోగినులను సచివాలయం వరకూ తీసుకువచ్చేందుకు ఎపిఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా సమకూరుస్తోంది.
ఏ కార్యాలయం ఎక్కడ
బిల్డింగ్ -1 గ్రౌండ్ ఫ్లోర్‌లో సాధారణ పరిపాలనా శాఖ, న్యాయశాఖ, బిల్డింగ్ -2 గ్రౌండ్ ఫ్లోర్‌లో మున్సిపల్ పరిపాలన, హోం, ఇంధన శాఖ, పరిశ్రమలు బిల్డింగ్-2 ఫస్టు ఫ్లోర్‌లో ఆర్ధిక శాఖ, ప్లానింగ్ శాఖల కార్యాలయాలు, బిల్డింగ్-3లో గ్రౌండ్ ఫ్లోర్‌లో సాధారణ సదుపాయాల కార్యాలయాలైన టెలికం, ప్లేస్కూల్, ఇ సేవ, పోస్ట్ఫాసు, బ్యాంకు, డిస్పెన్సరీ, జిమ్, అసోసియేషన్, ఐటి, నిక్, కేఫ్‌టేరియా, సెంట్రల్ రికార్డు బ్రాంచ్, ఎపిటిఎస్, లైబ్రరీ ఏర్పాటు చేస్తారు. బిల్డింగ్ -3 ఫస్టు ఫ్లోర్‌లో బిసి సంక్షేమ శాఖ, మైనార్టీ, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహిళా సంక్షేమం, యువజన సర్వీసులు, బిల్డింగ్-4 గ్రౌండ్ ఫ్లోర్‌లో వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, పర్యావరణం- అటవీ, రెవిన్యూ శాఖలు, బిల్డింగ్ -4 ఫస్టు ఫ్లోర్‌లో ఉన్నత విద్య, ఐటిసి, పాఠశాల విద్య, జలవనరులు శాఖలు, బిల్డింగ్ -5 గ్రౌండ్ ఫ్లోర్‌లో వైద్య శాఖ, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, స్కిల్ డెవలప్‌మెంట్, బిల్డింగ్ -5 ఫస్టు ఫ్లోర్‌లో టిఆర్ అండ్ బి, ఎపివిసి, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్, సిఎస్ అండ్ సిఎ, పే అండ్ అకౌంట్స్ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నారు.