తెలంగాణ

ఐసిస్ హబ్‌గా హైదరాబాద్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: ఇస్లామిక్ స్టేట్ సిరియా హబ్‌గా హైదరాబాద్ మారుతోందా? ఉగ్రవాద భావజాలం వైపు మళ్లుతోన్న నగర యువత సంఖ్య పెరుగుతోందా? ఇటీవల నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేసిన నలుగురు యువకులు జనూద్- ఉల్- ఖలీఫ్- ఎ- హింద్ నుంచి ఐసిస్‌లోకి చేరేందుకు నిశ్చయించుకొని నాగపూర్- పుణె విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ పరిచయాలతోనే నగర యువత చెడుదారి పడుతోందని ఐసిస్‌లో చేరేందుకు యత్నించి పట్టుబడిన నలుగురు యువకులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో చెప్పిన నిజాలను బట్టి అర్థమవుతోంది. హైదరాబాద్‌లో ఐసిస్ చేరేందుకు 35మంది యువకులు ఆసక్తితో ఉన్నట్టుగా రాడార్ ద్వారా తెలిసిందని ఎన్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు. వీరంతా జునూద్ సంస్థకు చెందిన వారుగా గుర్తించినట్టు చెప్పారు. ముత్ అబీర్ ముస్తాఖ్ నేతృత్వంలో వీరంతా ఐసిస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు ఇటీవల అరెస్టయిన మహమ్మద్ నఫీస్ ఖాన్, మహమ్మద్ షరీఫ్ మోహినుద్దీన్ ఖాన్ ద్వారా తెలిసిందని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే వీరికి హవాలా ద్వారా నిధులు అందుతున్నట్టు ఇటీవల టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఒబేదుల్లాఖాన్ అరెస్టుతో విషయం బయటకు పొక్కింది. 2014 సెప్టెంబర్‌లో నగరానికి చెందిన 15మంది యువకులతోపాటు ఒక మహిళ సిరియాకు వెళ్లేందుకు యత్నించి పశ్చిమ బెంగాల్‌లో అరెస్టయ్యారు. జనవరి 2015లో హైదరాబాద్ శంషాబాద్‌లో సల్మాన్ మోహినుద్దీన్ అరెస్టుతో నిక్కి జోసెఫ్ విషయం బయటపడింది. కాగా ఈమె దుబాయ్ నుంచి సెప్టెంబర్ 11న నగరానికి రాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. నిక్కీ జోసెఫ్ అలియాస్ అఫ్షాజబీన్ యువకులను ఫేస్‌బుక్ ద్వారా ఉగ్రవాద భావజాలంతో ఆకర్షించేది. దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఐసిస్‌లోకి చేర్పించేందుకు యత్నించినట్టు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఎంఎస్ స్టూడెంట్ హఫీజ్ ఐసిస్‌లో చేరి యుద్ధంలో మృతి చెందాడు. అదేవిధంగా 12 డిసెంబర్ 2015న నగరానికి చెందిన ఇద్దరు యువకులు అరెస్టయ్యారు. ప్రస్తుతం వీరు ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్నారు.