తెలంగాణ

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంటిపై ఐటి అధికారుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, సెప్టెంబర్ 29: మెదక్ జిల్లా పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంటిపై గురువారం ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 24 మంది ఆదాయపన్ను అధికారుల బృందం పట్టణంలోని ఐదుచోట్ల దాడులు నిర్వహించింది. ఇవి కాకుండా మిగతా తొమ్మిది ఏకాలంలో దాడులు జరిపినట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిపై, అతని తమ్ముడు మధుసూదన్‌రెడ్డి ఇంటిపై, జిఎంఆర్ కనె్వన్షన్ సెంటర్‌పై, జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంపై ఐటి అధికారులు ఒకేసారి దాడులు జరిపారు. మధ్యాహ్నం నాలుగు గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. ఆదాయపన్ను అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్, సంగారెడ్డి ఆదాయపన్ను అధికారి సాయిప్రతాప్ తదితరుల ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి . సుమారు పది మంది అధికారుల బృందం ఎమ్మెల్యే నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాలలో మహిళా అధికారులు సైతం పాల్గొన్నారు. గురువారం రాత్రి పదిన్నర గంటల వరకు ఆదాయపన్ను అధికారులు మీడియా ప్రతినిధులకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇంకా తనిఖీలు జరుగుతున్నాయని సమచారం మాత్రం అందించారు.
ఆదాయపన్ను చెల్లించడంలో ఆలస్యం అయినందున తనిఖీలు
ఆదాయపన్ను చెల్లించడంలో కేవలం రెండు మాసాలు ఆలస్యం అయినందున సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. తమ వద్ద ఆధారాలు లేని ఎలాంటి ఆస్తులు లేవని అన్నారు. అంతా సవ్యంగానే ఉందని ప్రస్తుతం ఉన్న ఆస్తులకు సంబంధించిన అన్ని పత్రాలు అధికారులకు చూపామన్నారు.