తెలంగాణ

సైనిక చర్యకు సంపూర్ణ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైనిక బలగాల మిలిటరీ చర్యలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌పై మిలిటరీ దాడులు అవసరమన్నారు. భారత సైనికులకు అండగా ఉంటామన్నారు. ఉగ్రవాదాన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించే ప్రసక్తిలేదన్నారు. మన దేశంలో ఉగ్రవాదుల చొరబాటును ప్రేరేపిస్తున్న పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని, మాటలతో పాకిస్తాన్ దారికి వచ్చేటట్లు కనపడడం లేదని ఆయన అన్నారు.