ఆంధ్రప్రదేశ్‌

లక్షిత దాడులతో పాక్‌కు చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, అక్టోబర్ 2: ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి మన సైన్యం జరిపిన లక్షిత (సర్జికల్) దాడులులాంటివి ఎంతో అవసరమని హిందూ ధర్మ పరిరక్షక సమితి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఐటి సలహాదారు త్రిపురనేని హనుమాన్ చౌదరి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఇతర దేశాల మద్దతు తీసుకుని పాక్‌ను ఏకాకి చేసి సర్జికల్ దాడులతో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడంతో ఆ దేశం కిక్కురుమనకుండా నోరుమూసుకుని కూర్చుందని పేర్కొన్నారు. హిందూ ధర్మరక్ష సమన్వయ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షతన ఆదివారం ఆదోని పట్టణంలోని వీరశైవ కల్యాణ మండపంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్‌చౌదరి మాట్లాడుతూ, చైనా యుద్ధం సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూకు ఏ దేశం కూడా మద్దతు ఇవ్వలేదని, కానీ నేటి ప్రధాని మోదీ తీసుకున్న చర్యకు అనేక దేశాలు మద్దతు తెలిపాయన్నారు. సర్వమానవ సమానత్వాన్ని చాటింది ఒక హిందూ ధర్మమేనని ఆయన అన్నా రు. ఇతర మతాల్లో అసహనం, ద్వేషం రక్తపాతం సృష్టించే విధానాలు ఉన్నాయన్నారు. 84 లక్షల జీవరాసులకు సమానమైన గౌరవం ఇచ్చేది హిందూ సంస్కృతి మాత్రమేనని అన్నారు. అయితే నేటి సమాజంలో హిందువుల్లో ఐక్యత త గ్గిందన్నారు. భారతీయ సంస్కృతి అ యిన ఇతిహాసాలు, కళలు అన్నీ కలిపితేనే భారతీయ విద్య అన్నారు. నెహ్రూ కుటుం బం అధికారంలోకి వచ్చిన తరువాత హిం దూత్వంపై మతోన్మాద ముద్ర వేయడం వల్ల హిందువు అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ధర్మానికి హాని జరుగుతుంది కాబట్టి సంత్‌లు, సాధువులు, పీఠాధిపతులు ధర్మాన్ని కాపాడుకోవటానికి ముందుకు వస్తారని చెప్పారు. హిందువుల మూలాలను తుంచడానికి క్రైస్తవులు కుట్ర చేస్తున్నారన్నారు. మెజార్టీ హిందువుల సొమ్ముతో చర్చిలు, మసీదులు కడుతున్నారన్నారు. చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేనప్పుడు దేవాలయాలు మాత్రం ఎందుకు ప్రభుత్వ ఆధీనంలో నడవాలన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండే దేవాయాలను బయటకు తీసుకురావడానికి తాము చివరిదాకా పోరాటం చేస్తామని గుర్తుచేశారు. హిందువుల్లో ఉన్న లక్షమంది దళితులకు తిరుపతితో పాటుగా ప్రముఖ దేవాయాలను ప్రభుత్వం ఖర్చుతోనే చూపించే ఏర్పాటు చేయాలని తాము కోరిన తరువాత ఏపి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దేవాలయాలను కేంద్రంగా చేసుకుని ధర్మరక్షణ సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది నరసింహారావు, మైసూర్‌స్వామి, విశ్వహిందు పరిషత్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.